Ads
ఎన్టీ రామారావు గారికి పౌరాణిక చిత్రాలు అంటే ఎంత ప్రాణమో తెలిసిందే. అందువల్లే ఆయన తాను నటించినఆ పౌరాణిక క్యారెక్టర్లకి సంబంధించిన ఆభరణాలు, దుస్తులు, గదలు వంటి వాటిని జాగ్రత్తగా ఆయన మ్యూజియంలో భద్రపరిచారు. ఎన్టీఆర్ రెండవ భార్య అయిన లక్ష్మీపార్వతి ఆధీనంలో ఈ మ్యూజియం ఉంది.
Ads
ఈ ఆభరణాలను టాలీవుడ్ వజ్రోత్సవంలో ప్రదర్శించారు. ఆ సమయంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ వీటిని సందర్శించి ఎన్టీ రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన సినీ ప్రియులను పులకరింపజేసింది. ఎన్టీఆర్ తాను నటించిన పౌరాణిక చిత్రాలలోని ఆభరణాలను ఎందుకు సేకరించాలనుకున్నారు అనే విషయాన్ని ఒక సందర్భంలో ఆయన తెలిపారు.
1955లో జై సింహా చిత్రంలో ఒక సీన్ లో అర్జున పాత్రలో చేశాను. అది నేను నటించిన తొలి పౌరాణిక పాత్రగా భావిస్తానని చెప్పారు. ఆ క్యారెక్టర్ చేసిన తరువాతే తనకు పూర్తిస్థాయి పౌరాణిక సినిమా చేయాలనే కోరిక కలిగిందని తెలిపారు. పౌరాణిక పాత్రల ద్వారా గుర్తింపు లభించిన తరువాత వాటి గురించి ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నానని చెప్పారు. అలా ఆనాటి నుండి ఎన్టీఆర్ నటించడం మానేసే వరకు కళా దర్శకులు ఎంతో మంది అద్భుతంగా తయారు చేసిన కిరీటాలను, ఆభరణాలను భద్రపరుస్తూ వచ్చానని ఆయన చెప్పారు.
వాటిలో కొన్నింటిని తానే దగ్గర ఉండి మరి తయారు చేయించుకున్నానని అలాంటి వాటిని జాగ్రత్తగా రాబోయే తరాలకు అందించాలని, అప్పుడే వారికి నా అభిరుచి తెలుస్తుందని చెప్పారు. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానని, వాటిని చూసినపుడు ఒక్కో గద, ఒక్కో కిరీటం తనలోని నటుడిని తట్టి లేపుతుందని తెలిపారు. వేల కట్టలేని ఆ అపురూపమైన ఆభరణాలను చూసినపుడు అప్పటి పౌరాణిక వైభవం కళ్ళ ముందు కదలాడుతుందని ఎన్టీఆర్ వెల్లడించారు.
Also Read: నితిన్ టు శ్రీముఖి.. నిజామాబాద్ జిల్లా నుండి వచ్చిన 7 గురు ప్రముఖులు వీరే..!