తెలంగాణ బ్యాక్ డ్రాప్ మరియు యాసతో సూపర్ హిట్ సాధించిన 7 చిత్రాలు ఏవంటే?

Ads

దర్శక నిర్మాతలు సాధారణంగా ఒక సినిమా స్టోరిని ఒక ప్లేస్, దాని బ్యాక్ డ్రాప్, అక్కడ ఉండే మనుషుల జీవన విధానాల ఆధారంగా తెరకెక్కిస్తుంటారు. ప్లేస్, నేపద్యంతో పాటు అక్కడి యాస కూడా ముఖ్యం. సినిమా ఆడియెన్స్ కి దగ్గర అయ్యేలా చేయడంలో భాష, యాస అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

Ads

అలా వచ్చిన వాటిలో తెలంగాణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలన్ని ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో ముఖ్యంగా ఆర్. నారాయణ మూర్తి సినిమాలు, దర్శక రత్న దాసరి నారాయణ సినిమాలు లాంటివి చాలా ఉన్నాయి. కరోనా తరువాత తెలంగాణ బ్యాక్ డ్రాప్, యాసతో వచ్చి విజయం సాధించిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. జాతిరత్నాలు..
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో అనుదీప్ కె.వి దర్శకత్వం వహించిన ఎంటర్‌టైనర్ మూవీ జాతిరత్నాలు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట్ బ్యాక్ డ్రాప్ లో  రూపొందిన ఈ సినిమా కరోనా తరువాత సూపర్ హిట్ అయిన తొలి చిత్రం.
2. వకీల్ సాబ్..
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలో  పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అగ్ర హీరో తెలంగాణ యాసలో మాట్లాడిన చిత్రం ఇదే. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
3.లవ్ స్టోరీ:
దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన  అందమైన ప్రేమ కథ మరియు ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీ నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన స్టోరీ. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
4.డీజే టిల్లు:
సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీతో సంచలనం సృష్టించాడు. టిల్లు క్యారెక్టర్‌కి యువత, ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలంగాణ యువకుడిగా సిద్ధు అద్భుతంగా నటించాడు.
5.ఆర్ఆర్ఆర్ – జూనియర్ ఎన్టీఆర్:
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా తెలంగాణ యాసలో అదరగొట్టాడు. ఆయన పద ఉచ్ఛారణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు.
6.వాల్తేరు వీరయ్య – రవితేజ:
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇందులో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు.
7. బలగం:
కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. పల్లెటూరి వాతవరణం, తెలంగాణ నేపథ్యంలో సహజమైన క్యారెక్టర్స్ తో మనుషుల మధ్య ఉండే సంబంధాలను హృదయాలను కదిలించేలా తెరకెక్కించి, కంటతడి పెట్టించారు. చిన్న సినిమా వచ్చిన బలగం ఆడియెన్స్ మనసులు గెలిచిన సినిమాగా నిలిచింది.

Also Read: ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు పాట’ గురించి ఈ విషయాలు తెలుసా?

Previous articleజీన్స్ ప్యాంట్ కి చిన్న పాకెట్లు ఎందుకుంటాయో తెలుసా.. వాటి ఏర్పాటు వెనుక ఉన్న కధ కమామిషు చూద్దాం!
Next articleసూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగులో చదవడం, రాయడం రాదు.. డైలాగ్స్ ఎలా చెప్తారంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.