Ads
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పిల్లలో ఆత్మవిశ్వాసం లోపించడం అనేది ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఇది సాధారణ సమస్యలా అయ్యింది. ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఎంతో మంది పిల్లలు చిన్న చిన్న వాటికే కృంగిపోయి ప్రాణాలు తీసుకునేదాక వెళ్తున్నారు.
Ads
ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను తేలికగా అధిగమించగలరు. అందుకే తల్లితండ్రులు పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు వారి చిన్నతనం నుండే కృషి చేయాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల చాలా సార్లు పిల్లలు వారికి లైఫ్ లో వచ్చే మంచి అవకాశాలను కూడా కోల్పోతారు. కొందరు పిల్లలు తమను తామే తక్కువ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెంపొందించడం పేరెంట్స్ బాధ్యత. పిల్లలలో ఉపకరించే ఆత్మవిశ్వాసం పెంచడం కోసం ఈ నాలుగు సూత్రాలు పాటించండి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.ప్రేమించడం:
ఇప్పుడున్న పరిస్తితుల్లో పేరెంట్స్ జీవితం కూడా ఒత్తిడితో కూడుకుని ఉంది. అయినప్పటికి పిల్లలకు తప్పనిసరిగా కొంచెం సమయాన్ని కేటాయించాలి. పిల్లలతో ప్రేమగా మాట్లాడి, వారు అడిగే ప్రశ్నలకు నెమ్మదిగా జవాబు చెప్పాలి. పిల్లలు చెప్పేవాటిని చాలా ఆసక్తిగా వింటూ, వారిలో జిజ్ఙాసను పెరిగేలా చేయాలి.
2.ప్రశంసించడం:
మంచి పని చేసినపుడు పిల్లలు ప్రశంసించాలి. వారు మరింత బాగా ఆ పనిని చేసే విధంగా ప్రోత్సహించాలి. ఇంట్లో మీరు చేసే పనులలో పిల్లలు కూడా పాల్గొనేలా చూడాలి.
3.నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉంచడం:
మనకు తెలియకుండానే మన పరిసరాల నుండి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. కాబట్టి ప్రతికూల వాతావరణం నుండి పిల్లలను దూరంగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుంది.
4.ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడం:
కొన్ని సార్లు పిల్లలు వారికి తెలియకుండానే చెడు మార్గంలో వెళ్తుంటారు. అలాంటి సమయంలో పిల్లలను కూర్చోబెట్టి నెమ్మదిగా ఏది తప్పు ఏది సరైనది అనేది చెప్పాలి. అలా చెప్పేటపుడు అది వారికి అర్థంమయ్యేలాగా చెప్పలే కానీ, మీరు చెప్పే మాటలతో పిల్లలు బాధ పడేలా మాట్లాడకూడదు.
Also Read: ఒక్కరు చాలు .. ఇద్దరు పిల్లలు వద్దని అనుకుంటున్నారా? అయితే ఆలోచించాల్సిందే..!