Ads
ఫ్యాక్టరీల పైకప్పుకి తిరుగుతూ ఉండే పరికరాన్ని అమర్చి ఉంచుతారు. మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా..? ఎందుకు ఫ్యాక్టరీలా పైకప్పుకి తిరుగుతూ ఉండే పరికరాన్ని పెడతారని.. ఈ రొటేటింగ్ ఎక్విప్మెంట్ ని పెట్టడానికి పెద్ద కారణం ఉంది. అయితే ఫ్యాక్టరీ కి దానికే సంబంధం ఏమిటి.. దాని వల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫ్యాక్టరీల పైకప్పుకి అమర్చే వాటిని రూఫ్ ఎక్స్ట్రాక్టర్స్ అని పిలుస్తారు. ఈ రూఫ్ ఎక్స్ట్రాక్టర్స్ వల్ల చాలా లాభం ఉంటుంది.
ఫ్యాక్టరీల కి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఇవి. మామూలుగా వేసవికాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వేడి వలన ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఫ్యాక్టరీలలో అయితే వేడి ఇంకా ఎక్కువ ఉంటుంది. దాంతో ఉద్యోగులు పని చేయడానికి కూడా కష్టంగా మారుతుంది.
Ads
వాళ్లకి రిలీఫ్ గా ఉండడానికే వీటిని పెడతారు. ఇవి పోర్టబుల్ ఫ్యాన్స్. చిన్న ప్రదేశాలలో వీటిని పెట్టడం వలన ఇవి చల్లగా ఉంచుతాయి. వేడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఉక్క తగ్గుతుంది. పైగా వీటిని పెట్టడం కూడా చాలా ఈజీ. వీటి ధర కూడా ఎక్కువేం ఉండదు ఇవి చాలా తక్కువ ధరకే మనకి అందుబాటులో ఉంటాయి.
మంచి వెంటిలేషన్ ని ఈ పరికరాలు ఇస్తూ ఉంటాయి. చల్లటి గాలిని ఇస్తాయి. వేసవికాలంలో అయితే చాలా బెనిఫిట్ అవుతుంది వేడిగాలి బయటకు వెళ్లి చల్లగాలి లోపలకి వస్తుంది అందుకే ఫ్యాక్టరీ పైకప్పులకి వీటిని అమరుస్తారు దీంతో లోపల అంతా కూడా కూలింగ్ గా ఉంటుంది. 1400 క్యూబిక్ మీటర్ల బిల్డింగ్ వరకు కూడా ఇది చక్కగా పని చేస్తుంది ఈ కారణంగానే ఫ్యాక్టరీల పైకప్పు కి వీటిని ఫిక్స్ చేస్తూ ఉంటారు.