నాగార్జున సినిమాల్లోకి వచ్చే ముందు.. అభిమానులకు ఏఎన్నార్ ఓ లేఖ రాసారు… ఏమనో తెలుసా..?

Ads

అక్కినేని నాగార్జున కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందరికీ అక్కినేని నాగార్జున గురించి తెలుసు, అప్పటినుండి ఇప్పటిదాకా చాలా సినిమాల్లో నటించి పాపులారిటీని పెంచుకుంటూనే ఉన్నారు. పైగా బిగ్ బాస్ రియాల్టీ షో హోస్టింగ్ తో కూడా నాగార్జున అందరిని ఆకట్టుకున్నారు. మన్మధుడిగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నారు.

అతని వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అఖిల్ నాగచైతన్య కూడా వచ్చారు. అయితే సినిమాల్లోకి రాకముందు నాగార్జున అమెరికా లో చదివారు. ఆయనకు సినిమాల్లో ఆసక్తి ఉంది. ఇండియాకి తీసుకువచ్చి హీరోగా పరిచయం చేయాలా వద్దా అనే సందేహంలో ఏఎన్ఆర్ పడ్డారు.

సినిమాల్లో ఆసక్తి ఉండేసరికి ఏఎన్నార్ నాగార్జున ని సినిమాల్లోకి తీసుకువచ్చారు. 1986లో నాగార్జున విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కెరియర్ మొదట్లో నాగార్జున నటించిన సినిమాలు ప్రేక్షకులకి అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. శివ సినిమాతో నాగార్జున కెరియర్ ఒక దారిలోకి వచ్చింది. గీతాంజలి సినిమా తర్వాత నాగార్జున క్రేజ్ బాగా పెరిగింది.

Ads

సినిమాల్లోకి వచ్చే టైం లో నాగార్జున కొంచెం కష్టపడ్డారు. ఏ హీరోకైనా సరే సినిమాల్లో సెటిల్ అవ్వడం ఈజీ కాదు. వెనకాల ఎంత బలం ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అయితే నాగార్జున ఎంట్రీ ఇచ్చే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు తన అభిమానులందరికీ ఒక బహిరంగ లేఖని రాశారు. మరి ఇక ఆ లేఖ లో నాగేశ్వరరావు గారు ఏం రాశారో ఇప్పుడు తెలుసుకుందాం…

42 ఏళ్లుగా ఆదరించి అభిమానించిన ప్రేక్షకులను ఉద్దేశించి లేఖని రాశారు నాగేశ్వరావు. నా సినిమాని కుటుంబ సమేతంగా వెళ్లి చూసేవాళ్ళు ఉన్నారు, నేను అలా చూడాలని అనుకున్నాను. నా అభిమానులు అందుకు సహకరించారు అని నాగేశ్వరరావు రాశారు. అలానే అభిమానులకి ఉన్న సంస్కారం వల్లే నా సినిమాలు తల్లి చెల్లి తో కలిసి చూడగలిగేలా ఎంచుకోవడం సాధ్యమైంది.

అందుకు మీకు జోహార్లు అని రాశారు. అమెరికాలో నా రెండో కుమారుడు చదువుని పూర్తి చేశాడు సినిమాపై అభిమానంతో ఇండస్ట్రీకి వద్దామని అనుకుంటున్నాడు. నన్ను అభిమానించే వాళ్లంతా నాగార్జునని కూడా అభిమానించి ఆదరిస్తారని భావిస్తున్నానని ఈ లేఖ లో నాగేశ్వరరావు రాసారు. అలానే ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు. ఆరోజు రంగ ప్రవేశం గురించి చెప్తాము. మనసారా ఆశీర్వదిస్తారని కోరుతున్నాను అని అక్కినేని నాగేశ్వరరావు లేఖలో రాశారు.

Previous articleమెట్రోలో కామన్ మ్యాన్ లాగా వెళ్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..?
Next articleఅరంగేట్రంలోనే నయనతార,అలియా, కత్రినాలను వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా?