Ads
చాలామంది నటులు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. నటులవ్వడం కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన అవకాశాలని పట్టుకుని ఇండస్ట్రీలోకి వస్తారు. అయితే ఒకేసారి సెలబ్రెటీ అయిపోలేరు అందుకని చాలామంది బుల్లితెర నుండి వాళ్ళ కెరీర్ ని మొదలుపెట్టి నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చారు.
సీరియల్స్ ద్వారా ఫేమస్ హీరోయిన్, హీరోలుగా మారిన ఆ నటులు ఎవరనేది ఈరోజు చూద్దాం. అయితే నిజానికి టాలెంట్ ఉంటే ఆలస్యమైనా కూడా సినీ ఇండస్ట్రీలో రాణించడానికి అవుతుంది వీళ్ళలో కొంతమంది ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా వాళ్ళ కెరియర్ ని రాణిస్తున్నారు. మరి ఇక బుల్లితెర నుండి వచ్చి సినిమాల ద్వారా పెద్ద స్టార్లు అయిన వాళ్ల గురించి చూద్దాం.
యష్:
యష్ పెద్ద స్టార్ అయిపోయాడు ఇప్పుడు. అయితే ఒకేసారి ఈ స్థాయికి చేరుకోలేదు. యష్ మొదట సీరియల్స్ ద్వారా పరిచయమై ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పాపులర్ అయిపోయాడు.
విజయ్ సేతుపతి:
విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు విజయ్ సేతుపతి కి ఉన్న ఫ్యాన్ బేస్ ఇంతా అంతా కాదు తమిళ సినిమాల్లోనే కాదు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు విజయ్ సేతుపతి. సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ లో నటించాడు.
లావణ్య త్రిపాఠి:
లావణ్య త్రిపాఠి కూడా సీరియల్స్ ద్వారానే సినిమాల్లోకి వచ్చింది సీరియల్స్ లో తన కెరీర్ ని మొదలుపెట్టి క్రమంగా సినిమాల్లో నటించి ఇప్పుడు ఈ స్థాయికి లావణ్య త్రిపాఠి చేరుకుంది.
షారుక్ ఖాన్:
Ads
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. షారుఖ్ ఖాన్ తన కెరీర్ ని సీరియల్స్ ద్వారానే మొదలుపెట్టాడు ఇప్పుడు పెద్ద స్టార్ హీరో కింద ఎదిగిపోయాడు.
విద్యాబాలన్:
విద్యాబాలన్ మంచి బాలీవుడ్ నటి. ఈమె కూడా పాపులర్ అయ్యింది. అయితే ఈమె తన కెరీర్ ని సీరియల్స్ తో మొదలుపెట్టారు. ఆ తరవాత సినిమాలతో ఇంకాస్త పాపులర్ అయ్యారు.
యామి గౌతమ్:
యామి గౌతమ్ తెలుగులో కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం వంటి సినిమాలు చేశారు ఈమె కూడా సీరియల్స్ నుండి వచ్చిన ఆమె. సీరియల్స్ నుండి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
రాధిక మదాన్:
బాలీవుడ్ నటి రాధిక కూడా సీరియల్స్ ద్వారానే సినిమాల్లోకి వచ్చింది. ఆకాశం నీ హద్దురా హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ పక్కన ఈమె నటించింది. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళలో ఈమె కూడా ఒకరు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా సీరియల్స్ తోనే కెరియర్ ని మొదలు పెట్టాడు తర్వాత క్రమంగా సినిమాల్లోకి వచ్చాడు. ఎంఎస్ ధోని వంటి సినిమాల్లో నటించి అందరినీ బాగా ఆకట్టుకున్నాడు సుశాంత్.
దివ్య:
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె తన కెరీర్ ని మొదలు పెట్టింది. శ్రీ దివ్య కూడా మొదట ఓ సీరియల్ లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.
మృణాల్ ఠాకూర్:
సీతారామం సినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. మృణాల్ ఠాకూర్ కూడా హిందీ సీరియల్స్ లో మొదట నటించింది. ఆ తరవాత సినిమాల్లోకి రావడం జరిగింది.