Ads
మనం సినిమాల్లో కానీ లేదంటే పల్లెటూర్లలో కానీ ఇలాంటి సీన్లు కనపడుతుంటాయి. సూర్యుడు ఉదయించబోయే విషయం కోళ్ళ కి ముందే తెలిసినట్లు కోళ్లు సూర్యుడు ఉదయించే సమయానికి అరుస్తూ ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది లేటుగా లేస్తున్నారు. కానీ ఇదివరకు తెల్లవారుజామునే చాలా మంది మేల్కొనేవారు.
ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్ లు పని మొదలైన కారణాల వలన నిద్ర లేవడం ఆలస్యం అవుతోంది. సూర్యుడు ఉదయించబోయే సమయం కోళ్ళకి ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం… ఇప్పుడు మనం నిద్ర లేవాలంటే అలారం పెట్టుకుని నిద్ర లేస్తూ ఉంటాము కానీ ఇది వరకు గ్రామీణ ప్రాంతాల్లో కోడి కూతతోనే నిద్రలేచే వాళ్ళు.
Ads
మనిషి కంటే ముందు కోళ్లే నిద్రలేచేవి సూర్యుడు ఉదయించడానికి ముందు కోళ్లు అరిచేవి. పశువులు కానీ లేదంటే ఇతర జంతువులు లేదంటే పక్షులు కానీ చీకటి పడగానే నిద్రపోతాయి ఈ కారణంగానే అవి ఉదయాన్నే నిద్ర లేచిపోతాయి. ముఖ్యంగా కోళ్ల జీవ గడియారం అంటే బయోగ్లాక్ మన కన్నా కాస్త ముందే ఉంటుంది. అందుకనే కోళ్లు సూర్యుడు ఉదయించడానికి 45 నిమిషాల ముందు పసిగడతాయి.
సూర్యుడు ఉదయించే విషయాన్ని అవి గుర్తించి కోళ్లు కూస్తాయి. వాటి కూత వినగానే మనకే కూడా మెలకువ వస్తుంది తెల్లవారు అయిందని తెలుస్తుంది. పైగా కోళ్ల బయోగ్లాక్ వేగంగా పని చేయడం వలన మన కంటే ముందు వెల్తూరిని అవి గుర్తిస్తాయి ఈ కారణంగానే కోళ్లు సూర్యుడు ఉదయించడానికి ముందుగానే లేచి కూస్తూ ఉంటాయి.
వెల్తురుని చూస్తే వాటికి ఉత్సాహం కూడా కలుగుతుంది ఇప్పటికి కూడా చాలా మంది కోడి కూతతోనే నిద్ర లేస్తూ ఉంటారు. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా కోళ్లు ఎందుకు సూర్యదయానికి ముందే నిద్రలేచి కూస్తాయని..