10 ఏళ్ళ క్రితం వచ్చిన పాట… ఇప్పుడు సడన్ గా ఫేమస్ అయ్యింది..! కారణం ఏంటంటే..?

Ads

కొన్ని పాటలు కానీ, సినిమాలు కానీ విడుదల అయినప్పుడు వాటిని అంత పెద్దగా పట్టించుకోరు. ఎన్నో కారణాల వల్ల వాటికి దొరకాల్సిన గుర్తింపు దొరకదు. అవి విడుదల అయిన ఎన్నో సంవత్సరాల తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాయి.

అలా ఇటీవల ఒక పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా ఆ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ పాట వచ్చి దాదాపు పది సంవత్సరాలు అయింది.

animal review

ఈ పది సంవత్సరాలలో ఆ పాట గురించి విడుదల చేసిన వారికి లేదా కొంతమందికి తప్ప ఎవరికీ ఎక్కువగా తెలియదు. కానీ ఇటీవల అది కూడా గత వారం రోజుల నుండి ఈ పాట క్రేజ్ పెరిగిపోయింది. ఆ పాట ఏంటో ఇప్పుడు చూద్దాం. జమాల్ జమాలూ.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ గా ఉంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీలో.. విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్ ఎంట్రీ కి ఈ సాంగ్ ఉపయోగించారు.

animal review

మామూలుగా విలన్స్ అంటే వైలెంట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ ఇస్తారు కానీ.. ఇందులో విలన్ ..అతని మ్యారేజ్ జరిగే సందర్భంగా ఇంట్రడ్యూస్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట పాడిన కి చూపించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మ్యూజిక్ బాగా వైరల్ గా వినిపిస్తుంది. ‘జమాల్ జమాలూ’అంటూ సాగే ఈ పాట.. బ్యూటిఫుల్ ఇరానీ సాంగ్.ఈ హిట్ ఇరానియన్ సాంగ్ ఖతేరేహ్ గ్రూప్ కంపోజ్ చేశారు. ఇది ఫార్సీ భాషలో ఉంటుంది.

Ads

a decade ago song is now trending on social media

ఈ సాంగ్ 10 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో వచ్చింది.ఈ సాంగ్ అప్పట్లో పెద్ద సంచలనమే అని చెప్పాలి. మళ్లీ తిరిగి ఇన్ని రోజులకి ఈ పాట ఇలా యానిమల్ మూవీతో తెరపైకి రావడంతో తిరిగి ఇది మళ్ళీ పాపులర్ అయింది. బాబీ డియోల్ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ యాక్టర్ .కానీ అవకాశాలు క్రమంగా తగ్గడంతో గత కొద్దికాలంగా అతని సినిమాలకు దూరమయ్యాడు.

 

watch video :

అయితే తిరిగి ఇప్పుడు అతను యానిమల్ మూవీ తో ఇచ్చిన రీ ఎంట్రీ టాలీవుడ్ లో పెద్ద హాట్ డిస్కషన్ గా మారింది. ఈ మూవీలో అతని యాక్షన్ అందరినీ మెస్మరైజ్ చేయడంతో పాటు మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో అతని ఎంట్రీ ట్రాక్ క్రేజీ గా మారడంతో సోషల్ మీడియాలో ఎందరో ఈ సాంగ్ కు డాన్స్ చేసి వీడియోస్ తో మరింత వైరల్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : ఈ ఫొటోలో అమ్మాయి ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో తెలుసా..?

Previous article76 ఏళ్ల క్రితం టీం ఇండియా కెప్టెన్ ఎవరో తెలుసా..? అప్పట్లో ఆస్ట్రేలియా వెళ్లిన ప్లేయర్స్ ఎవరంటే..?
Next article“ఇలాంటి అన్న ప్రసాదం పెట్టడం ఏంటి..?” అంటూ… తిరుమలలో భక్తుల ఆగ్రహం..! ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.