Ads
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అమీర్ ఖాన్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందంటూ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. సినిమాల్లో వైవిధ్యం చూపించే అమీర్ తన వైవాహిక జీవితం కూడా చాలా వైవిధ్యంగా మార్చుకున్నాడు.
అమీర్ ఖాన్ ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకుని తన భార్యలకు విడాకులు ఇచ్చి ఇప్పుడు వేరే ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సంఘటన పైన అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు స్పందించారు.అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీన దత్తా కి విడాకులు ఇచ్చి కిరణ్ రావు ను 2005లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2011 లో ఒక బాబు పుట్టాడు.
Ads
తాజాగా 2022 సంవత్సరంలో కిరణ్ రావు తో విడాకులు తీసుకున్నారు.దీనిపైన కిరణ్ రావు మాట్లాడుతూ మేము జంటగా విడిపోయిన కూడా కుటుంబంగా కలిసే ఉంటామని చెప్పింది.అమీర్ ఖాన్ భార్యలతో విడిపోయినా సరే కుటుంబాలు రెండు కలిసి ఉంటాయని తెలుస్తుంది. అమీర్ రెండు కుటుంబాలు ఒకే హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో కిరణ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.
అమీర్ ఖాన్ తో అతని మొదటి భార్యతో ఉన్న రిలేషన్ గురించి ఆమె మాట్లాడారు. విడాకులు తీసుకుంటే కుటుంబం విడిపోతుందని కాదు. అమీర్ కూతురు ఐరా పెళ్లికి మా ఫ్యామిలీలో అందరు అటెండ్ అయ్యాం. ఖాన్ కుటుంబమంతా కలిసే ఉంటాం మేము ప్రతి సోమవారం కలిసి పలు విషయాల పైన చర్చించుకుంటామని తెలిపింది. అమీర్ మొదటి భార్య రీనాతో కూడా తనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయని కిరణ్ రావు చెప్పుకొచ్చింది.