Ads
కొంత మంది హీరో పాత్రలు మాత్రమే చేస్తారు. కొంత మంది నటులు మాత్రం ఏ పాత్ర అయినా చేస్తారు. వారికి పాత్రకి ప్రాముఖ్యత ఉంటే చాలు. ఈ వ్యక్తి మాత్రం మొదట హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత కొన్నాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మళ్లీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అప్పటి నుండి సినిమాలతో దూసుకెళ్తున్నారు. హీరో జగపతిబాబు. ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న నటుడు. జగపతిబాబు నటన చాలా సహజంగా ఉంటుంది.
ఎలాంటి పాత్ర అయినా సరే జగపతిబాబు పోషించగలుగుతారు. శుభలగ్నం లాంటి సినిమాలో అమాయకంగా ఉండే ఒక భర్త పాత్ర పోషించిన జగపతిబాబు, అంతపురం సినిమాలో రఫ్ గా ఉండే ఒక వ్యక్తి పాత్ర పోషించారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో ఒక మంచి తండ్రిగా నటించిన జగపతిబాబు, రంగస్థలం సినిమాలో విలన్ పాత్రలో నటించారు. జగపతిబాబు హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు. మినిమం గ్యారంటీ హీరో అయ్యారు.
Ads
తర్వాత కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా జగపతిబాబు తన ధైర్యాన్ని కోల్పోలేదు. మళ్లీ హిట్ సినిమాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. కొంత కాలం బ్రేక్ తీసుకొని, లెజెండ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అందరూ కొత్త జగపతిబాబుని చూశారు. అప్పటి వరకు జగపతిబాబుని పాజిటివ్ పాత్రల్లో మాత్రమే అందరూ చూశారు. కానీ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించారు. అయినా కూడా జగపతిబాబు నటన ఏ మాత్రం మారలేదు. తన పాత్రకి 100 శాతం న్యాయం చేశారు.
అప్పటి నుండి జగపతిబాబు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు. చేస్తూ ఉన్నారు. తెలుగులో మాత్రమే కాదు. జగపతిబాబు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల జగపతిబాబు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ పైన ఫోటో జగపతిబాబు చిన్నప్పటి ఫోటో. ఈ ఫోటోలో తన స్నేహితులతో జగపతిబాబు ఉన్నారు. కుడి వైపు చివరిలో ఉన్న వ్యక్తి జగపతిబాబు. ప్రస్తుతం జగపతిబాబు, రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లో కూడా జగపతిబాబు నటిస్తున్నారు. వీటితో పాటు సలార్ రెండవ భాగంలో కూడా జగపతిబాబు కనిపిస్తారు.