Ads
రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకొని సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో పెద్దమ్మగా యాక్ట్ చేసిన సీనియర్ నటి ఎవరో తెలుసా.. ఆమె మరెవరో కాదు సుప్రసిద్ధ నటి వడిఉక్కరసి. బహుశా ఈ తరం వాళ్లకి తెలియకపోవచ్చు కానీ చాలా సంవత్సరాలుగా ఆమె తెలుగు సినిమాలలో నటిస్తూ ఉంది.
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో రాధిక స్నేహితురాలుగా నటించిన వడిఉక్కరసి ఆ తర్వాత అమ్మోరు, గుండమ్మగారి మనవడు, అందాల రాముడు, పోరంబోకు, అశోక్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అంతేకాకుండా తనకన్నా పెద్దవాడైన రజినీకాంత్ కి శివాజీ సినిమాలో తల్లిగా నటించి మెప్పించింది. ఇప్పుడు తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమాలో పెద్దమ్మగా నటించి మరొకసారి తెలుగువారికి చేరువైంది.
Ads
ప్రముఖ తమిళ దర్శకుడు ఏపీ నాగరాజన్ ఈమెకి మేనమామ వరుస అవుతాడు. అతను దర్శకత్వం వహించిన వడి ఉక్కు వలైకప్పు సినిమా వడివుక్కరసి పుట్టినరోజు నాడే విడుదల అవ్వటంతో ఆ పేరు ని ఆమెకి పెట్టారు. తర్వాత ఆమె తమిళ్ సినిమా సిగప్పు రోజక్కల్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. 2000 ప్రారంభంలో ఆమె టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించడం ప్రారంభించింది. దాదాపు 350 పైగా సినిమాలు, 25 పైగా సీరియల్స్ లో నటించింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో నటించిన ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. ఈమె నటన చూడాలంటే తమిళ డబ్బింగ్ సినిమా ఆత్మబంధువు సినిమా చూసి తీరాల్సిందే. ఇందులో శివాజీ గణేషన్ భార్యగా ఆమె నటించిన నటన, ఆమె గయ్యాళి తనం, భర్త అంటే ఆమెకి ఉన్న చులకనతనం రంగరించిన ఆ పాత్రలో వడిఉక్కరసి జీవించిందని చెప్పాలి.