Ads
సినిమాల్లో బోలెడన్ని ట్విస్టులు ఉన్నట్టే కొందరు హీరోల లైఫ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు ఉంటాయి. ఇదే కోవకు చెందిన వాడు సీనియర్ హీరో కార్తీక్. సౌత్ లో వందకు పైగానే సినిమాలు చేసి.. ప్రేక్షకులకు సుపరిచితమైన కార్తిక్ నిజజీవితంలో మాత్రం హీరో క్యారెక్టర్ కి పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. తన భార్య చెల్లెలినే పెళ్లి చేసుకున్న కార్తిక్ లైఫ్ లో ఎన్ని ట్రస్టులో ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
మురళి కార్తికేయన్ ముత్తురామన్ అలియాస్ కార్తిక్… అతని తండ్రి ఆర్ ముత్తురామన్ ఒక గొప్ప నటుడు కావడంతో.. కార్తీక్ అతని నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు.అలైగళ్ ఒవతిల్లై(1981 అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తి తన కెరీర్లో మంచి సక్సెస్ అందుకున్నాడు. చాలా తక్కువ కాలంలోనే కోలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఇతను సీతాకోకచిలుక సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు.
Ads
అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి.. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తమిళ్లో సంవత్సరానికి 8 నుంచి పది సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీగా ఉండే ఈ యాక్టర్ తర్వాత కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతని విషయంలో ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నే ఉండేవి.
ఈ నేపథ్యంలో 1988లో రాగిణి అనే హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతరు పిల్లలు పుట్టిన తర్వాత తమ ఇంట్లోనే ఉండే రాగిణి సోదరి రతిపైనా మనసు పారేసుకున్న కార్తీక్.. ప్రొఫైల్ పెట్టుకోవడం దాంతో ఆమెకు గర్భం రావడం జరిగిందని ఎన్నో రూమర్స్ వచ్చాయి.