2023 లో టాలీవుడ్ లో అడుగుపెట్టి… మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్న 7 హీరోయిన్స్ వీళ్ళే.!

Ads

2023 చివరికి వచ్చేసింది. ఈ సంవత్సరంలో ఎంతోమంది కొత్త వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొత్త కొత్త సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు సక్సెస్ అందుకున్నారు. మరికొందరు మొదటి సినిమాతోనే భారీ ప్లాప్స్ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న హీరోయిన్స్ లిస్టుని పరిశీలిస్తే..

#1. గాయత్రీ భరద్వాజ్:

రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు.

#2. సాక్షి వైద్య:

అక్కినేని అఖిల్ సరసన ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత ‘గాండీవ దారి అర్జున’ సినిమాలో నటించి మరో ప్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది.

#3. నుపుర్ సనన్ :

Ads

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరి అయిన ఈమె రవితేజ కి జోడిగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఆమెకు సక్సెస్ అందించలేకపోయింది. ఆ తర్వాత కన్నప్పలో ఛాన్స్ వచ్చినా కాదనుకొని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

#4. గీతికా తివారి :

తేజ ‘అహింస’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది.

#5. యుక్తి తరేజా :

నాగశౌర్యకు జోడిగా ‘రంగ బలి’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈమె తన క్యూట్ యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది. కానీ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

#6. ఐశ్వర్యా మీనన్ :

నిఖిల్ హీరోగా వచ్చిన ‘స్పై’ మూవీ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నటనతో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.

#7. ప్రియా భవానీ శంకర్ :

‘కళ్యాణం కమనీయం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈమె ఫస్ట్ మూవీ తోనే డిజాస్టర్ అందుకుంది.

Previous articleరెస్టారెంట్ కి వెళ్లి ఇలా ఎవరైనా చేస్తారా.? “జల్సా” సినిమాలో ఈ సీన్ గమనించారా.?
Next articleసెలెబ్రిటీల పిల్లలు చదివే ఈ స్కూల్ గురించి తెలుసా.? అక్కడ టీచర్లకు శాలరీస్ ఎంతంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.