Ads
దేవయాని అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. ఆ చిత్రంలో దేవయాని చాలా సింపుల్ గా హీరో అంటే ప్రేమ ఉన్నా, లేనట్టుగా, తండ్రి అంటే భయపడే మధ్యతరగతి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. ఈ చిత్రం తరువాత దేవయాని తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదు.
Ads
దేవయాని కెరీర్ 1993 లో బెంగాలీ చిత్రంతో ప్రారంభం అయ్యింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ లో బిజీ అయిపోయింది. తెలుగు, మలయాళం, బెంగాలీ భాషల్లో అప్పుడప్పుడు నటిస్తూ తమిళ సినిమాలలోనే ఎక్కువగా నటించింది. దేవయాని ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 90 చిత్రాల్లో నటించారు. ఏడు టీవి సీరియల్స్ లో నటించారు. అలాంటి హీరోయిన్ ఒక దశలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేశారంట. అది కూడా ఆమె హీరోయిన్ అయిన తరువాతనే. ఆమె ఎందుకు టీచర్ గా పని చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
దేవయాని తెలుగులో కొన్ని చిత్రాలలోనే నటించినప్పటికి ఆడియెన్స్ కి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ లోనే నటించింది. సుస్వాగతం సినిమాలో మధ్యతరగతి అమ్మాయిలా, నాని చిత్రంలో మహేష్ బాబుకి అమ్మగా, చెన్నకేశవరెడ్డిలో బాలకృష్ణకు చెల్లెలిగా, జనతాగ్యారేజ్ మరియు అరవింద సమేత చిత్రాలలో ఎన్టీఆర్ కి అమ్మగా నటించి ఆకట్టుకుంది. దేవయాని ముంబైలో జన్మించింది. ఆమె నిజమైన పేరు సుష్మ. దేవయాని మిగతా హీరోయిన్ల మాదిరిగా గ్లామర్ పాత్రలు చేయకుండా కెరీర్ మొత్తం కూడా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించింది.
ఇక దేవయాని కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే డైరెక్టర్ రాజ్ కుమార్ ని ప్రేమించింది. ఇంట్లో అంగీకరించక పోవడంతో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఇనియా, ప్రియాంక. దేవయాని ఇతర భాషలలో చాలా చిత్రాలలో నటించి పాపులర్ అయ్యింది. కానీ ఆమె ఆమె మాతృ భాషా కొంకణి. ఆ భాషలో దేవయాని అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న టైమ్ లోనే వివాహం చేసుకోవడం, పిల్లల కోసం సమయం గడిపే క్రమంలో అవకాశాలు తగ్గాయి.
దాంతో ఆమె నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను చేయడం, ఆ చిత్రాలు ప్లాప్ అవడంతో డబ్బు నష్టపోయి దేవయాని ఆర్ధికంగా కోలుకోలేని స్థితికి వచ్చింది. దాంతో ఆమె సినిమాలను వదిలి, ప్రెవేట్ స్కూల్ లో టీచర్ గా చేయడం మొదలు పెట్టింది. అలా చేస్తున్న కొన్ని రోజుల తరువాత దేవయానిని వెతుక్కుంటూ అమ్మ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. అలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలే జనతా గ్యారేజ్, అరవింద సమేత. దేవయాని సినిమాలే కాకుండా తమిళం మరియు మలయాళంలో సీరియల్స్ లో నటిస్తూ ప్రస్తుతం బిజిగా మారారు.
Also Read: బాహుబలి మూవీలో తమన్నా క్యారెక్టర్ చేజార్చుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?