Ads
సినిమా హీరోయిన్స్ లైఫ్ స్టైల్ చాలా భిన్నంగానూ, ప్రత్యేకంగానూ ఉంటుంది. ఇక వారి జీవితంలో ఏం జరిగినా కూడా అది చిన్నదైన,పెద్దదైన కూడా అనాద్రి దృష్టి వారి మీదనే ఉంటుంది.
Ads
ఇక చాలా మంది హీరోయిన్స్ వ్యక్తిగత విషయాల గురించి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అలాగే సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఎవరికి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. మరి వారెవరో తెలియాలి అంటే ఈ లిస్ట్ చూడాల్సిందే.1.సావిత్రి:
మహానటి సావిత్రి తిరుగులేని నటిగా సౌత్ సినీ పరిశ్రమను ఏలింది. ఆమె కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే జెమిని గణేశన్‌ను సీక్రెట్ గా వివాహం చేసుకుని ఫ్యాన్స్, ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేసారు.అయితే జెమిని గణేశన్ కు అప్పటికే రెండు వివాహాలు అయ్యి, పిల్లలున్నారు. ఇక ఈ విషయం ‘లక్స్’ సబ్బు ప్రమోషన్ సమయంలో సావిత్రి జెమిని గణేషన్ అని సంతకం పెట్టడంతో ఆ పెళ్లి గురించి అందరికి తెలిసింది.
2.శ్రీదేవి:
జగదేక సుందరి శ్రీదేవి రెండు సార్లు వివాహం చేసుకుంది. కేరర్ మొదట్లో హీరో మిథున్ చక్రవర్తిని రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు.కానీ మూడేళ్లకే విడిపోయారు. ఆ తరువాత శ్రీదేవి బోనీ కపూర్‌ని అతికొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్నారు.
3.జయప్రద :
తెలుగు హీరోయిన్ గా సౌత్,నార్త్ లోను రాణించిన జయప్రద కూడా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. ఆమె బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ నహతాని పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయనకి అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు కూడా వుండటంతో పెళ్లి గురించి జయప్రద బయటకు చెప్పలేదు.
4.సీత :
బాలకృష్ణగా చెల్లెలిగా ముద్దుల మావయ్యలో సినిమాలో నటించిన సీత, ఆ తరువాత కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించారు. తమిళ హీరో పార్ధీబన్‌ని పెళ్లి చేసుకున్నారు.పెళ్లయిన కొంతకాలనికే విడిపోయారు. 2010లో సీరియల్ నటుడు సతీష్‌ని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారు.
5.రమ్యకృష్ణ:
హీరోయిన్ రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీతో ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి వివాహం కూడా రహస్యంగా ఒక దేవాలయంలో చేసుకున్నారు.6.దేవయాని:
సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించిన దేవయాని రాజకుమార్ అనే డైరెక్టర్ ని ప్రేమించారు. ఇంట్లోవారికి చెప్పి వివాహం చేసుకోవాలనుకున్నా, వారు వినకపోవడంతో దేవయాని ప్రేమించిన వ్యక్తి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు.
7.శ్రీయా శరణ్:
హీరోయిన్ శ్రీయా ప్రేమ, వివాహం, పిల్లల విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పరిశ్రమకే షాక్ ఇచ్చారు. ఆమె రష్యాకి చెందిన ఆండ్రీ కోషీవ్ తో ప్రేమ,పెళ్లి చేసుకున్న విషయం గానీ, చివరికి సంతానం గురించి కూడా బయటకు రానియకుండా చాలా జాగ్రత్త పడ్డారు.8.అనన్య :
మలయాళ హీరోయిన్ అనన్య లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఆమె ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.9.సాత్నా టైటస్:
సాత్నా టైటస్ అంటే తెలియక పోవచ్చు కానీ, బిచ్చగాడు మూవీ హీరోయిన్ అంటే మాత్రం గుర్తుపడతారు. ఈ మలయాళ నటి పారిపోయి వివాహం చేసుకున్నారు. బిచ్చగాడు మూవీ బయ్యర్ కార్తికీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.10.రాణీ ముఖర్జీ:
రాణీ ముఖర్జీ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఫ్యామిలిస్ లో ఒకటైన చోప్రా కుటుంబ వారసుడైన ఆదిత్య చోప్రాని ప్రేమించి, రహస్యంగా 2014, ఏప్రిల్ 21న ఇటలీలో ఆదిత్య చోప్రాని రాణీ ముఖర్జీ వివాహం చేసుకున్నారు.
Also Read: మెగా ఫ్యామిలీలో ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఎవరో తెలుసా?