ఈ ఫొటోలో అమ్మాయి ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో తెలుసా..?

Ads

సినిమా హీరోయిన్స్ ని అందానికి ఐకాన్స్ అని చెప్పవచ్చు. వారి అందాన్ని ఆరాధించే వారు లక్షలాది మంది ఉంటారు. చాలావరకు హీరోయిన్స్ మేకప్ లేకుండా సినిమాలలో కనిపించరు. మేకప్ లేకుండా ఉంటే ఎంత పెద్ద అందగత్తె అయినా సాధారణ అమ్మాయిలానే కనిపిస్తుంది.

చాలామంది హీరోయిన్లను మేకప్ లేకుండా చూసి గుర్తు పట్టడం కష్టం అని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న యంగ్ హీరోయిన్ మేకప్ లేకుండా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
తెలుగులో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ హీరోయిన్. తన అందం,  నటనతోనే కాకుండా తన డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దాంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఆమెకు యూత్ లో విపరీతమైన పాపులారిటీ  ఏర్పడింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ కోసం థియేటర్లకు ఆడియెన్స్ వెళ్తారనడంలో ఎలాంటి సందేహం  లేదని చెప్పవచ్చు. ఆమె ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు.  శ్రీలీల.
శ్రీలీల 2001లో యూఎస్ లోని మిచిగాన్ లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జూన్ 14న జన్మించారు. బెంగుళూరులో పెరిగారు. శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగుళూరులో గైనకాలజిస్ట్. శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ ప్రారంభించింది. ఆమె ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె 2019 లో హీరోయిన్ గా కన్నడ సినిమా ‘కిస్’ లో నటించింది. అదే ఏడాది భరతే అనే కన్నడ మూవీలో నటించింది.
2021లో పెళ్లి సందడి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. శ్రీలీల నటనకు విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. ధమాకా మూవీతో హిట్ అందుకుని వరుసగా సినిమాలు చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల పక్కన నటిస్తోంది. తాజాగా ఆమె మేకప్ లేకుండా ఉన్న ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గామారింది. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సాయి పల్లవి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా..? ఏంటి ఆమె ప్రత్యేకత..?

Previous article“తండ్రైన తర్వాత నా కొడుకు ఎలా మారిపోయాడంటే.?” అంటూ ఫాథర్స్ డే రోజు ఓ తండ్రి పంపిన లెటర్ ఇది.! చూస్తే కనీళ్లొస్తాయి.!
Next articleతెలుగులో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ముందు ఉండే సినిమా ఇది..! ఈ సినిమా చూశారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.