Ads
కొంతమంది నటులకి ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్లు పడతాయి. అవి ఎలా ఉంటాయంటే మెయిన్ క్యారెక్టర్స్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. అవ్వటానికి ఆ క్యారెక్టర్లు సైడ్ క్యారెక్టర్లు కానీ ఫ్రెండ్ గాని సిస్టర్ గాని అయి ఉంటాయి .
కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ కి డైలాగులు కూడా ఉండవు అయినా మెయిన్ క్యారెక్టర్స్ కంటే కూడా పాపులర్ అయిపోతూ ఉంటారు. అలాంటి కొన్ని క్యారెక్టర్లు ఇప్పుడు చూద్దాం.
#1 డియర్ కామ్రేడ్: డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే అయితే హీరోయిన్ రష్మిక కన్నా ఆమె అక్కగా నటించిన శృతి రామచంద్రన్ చాలా బాగుంటుంది అని సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి.
#2 లవర్స్ డే: ఈ సినిమాలో చాలామంది ప్రియా ప్రకాష్ వారియర్ ని చూడటానికి వెళ్లారు. అయితే ఈ సినిమాలో ప్రియా కన్నా నూరిన్ షరీఫ్ ఎక్కువ ఫేమ్ కొట్టేసింది.
#3 అశోక వనంలో అర్జున కళ్యాణం: ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా విశ్వక్సేన్ మరియు రుక్షర్ నటించారు అయితే రుక్షర్ కి చెల్లెలుగా నటించిన రితికా నాయక్ ఎక్కువగా అందరి హృదయాలని దోచుకుంది.
Ads
#4 ఫిదా: ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి పేరు వచ్చింది హీరోయిన్ తో పాటు ఆమె అక్కగా నటించిన శరణ్య ప్రదీప్ కూడా ఈ క్యారెక్టర్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
#5 ఉయ్యాల జంపాల : ఈ సినిమాలో అవికా గోర్ ఎంత అలరించిందో ఆమెకి ఫ్రెండ్ గా నటించిన పునర్నవి కూడా హీరోయిన్ కి తీసుకొని ఫేమ్ ని సంపాదించుకుంది.
#6 వీర సింహారెడ్డి : ఈ సినిమాలో హీరోయిన్ కన్నా హనీ రోజ్ కి ఎక్కువ మంది ఫ్లాట్ అయిపోయారు.
#7 హిట్ 2: ఈ సినిమాలో మీనాక్షి ప్రసాద్ కంటే పోలీస్ క్యారెక్టర్ వేసిన కోమలి ప్రసాద్ కే ఎక్కువ ఫాన్ బేస్ దక్కింది.
#8 అఆ : ఈ సినిమాలో సమంత కి ఎంత పేరు వచ్చిందో సెకండ్ హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కి కూడా అంతే పేరు వచ్చింది.
#9 సలార్: అలాగే ఈ మద్యే వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా సలార్ లో నిజానికి హీరోయిన్ శృతిహాసన్. కానీ రాధా రమ పాత్ర చేసిన శ్రియ రెడ్డికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ రావడం గమనార్హం.