Ads
మనిషిని పోలినటువంటి మనుషులు లోకంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. నిజమో కాదో అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఇది వాస్తవమే. అయితే ఒకేలాగా ఉండకపోయిన తొంబై శాతం వరకు మ్యాచింగ్ చెయ్యగల మనుషులు చాలా మంది ఉంటారు. ఇటీవల విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా అని అంటున్నారు.
మెక్సికోలో ఈ చిత్రంలో చూపించినట్టుగా ఒకే రూపంతో కలిగిన ముగ్గురూ మనుషులు కలిసి ఉన్నారట. అంతేకాకుండా ఆ రోజుల్లో ఆ ముగ్గురిని ఇంటర్వ్యూ కూడా చేశారంట. ఈ విషయం అప్పట్లోనే అక్కడ వైరల్ అయ్యిందంట. గతంలో ఆ సంఘటనను స్పూర్తిగా తీసుకొని అక్కడ చాలా సినిమాలను తెరకెక్కించారంట. ఇప్పుడు తెలుగు వచ్చిన ‘అమిగోస్’ సినిమాని కూడా వాటిలో ఒకటిగా చెప్పవచ్చు.
అయితే ‘అమిగోస్’ మూవీలో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం లేనివి, ఉన్నట్టుగా కల్పించి తీశారు. అలా కల్పించిన ఒక క్యారెక్టర్ ను నెగటివ్ షెడ్ తో గా చూపించారు. అయితే ఈ చిత్రం తెరకెక్కించడానికి వచ్చిన ఆలోచన మాత్రం మెక్సికో లోని ఆ ముగ్గురి లైఫ్ ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ అని తెలుస్తుంది. అయితే ఇలా మనుషులను పోలిన మనుషులు ఒక్క మెక్సికోలో మాత్రమే కాకుండా అన్ని దేశాలలో కూడా ఉంటారు. ఇక దీన్ని స్పూర్తిగా తీసుకుని తన చిత్రానికి స్టోరీని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు.
Ads
రాజేందర్ రెడ్డికి దర్శకుడిగా ‘అమిగోస్’ తొలి చిత్రం అయిన కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవకుండా, అర్థం అయ్యేటట్టుగా ఈ చిత్రాన్ని తీశారు. గత ఏడాది కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ‘బింబిసారా’ కమర్షియల్ గా, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలా అమిగోస్ ఉంటుందని చెప్పలేము. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరు అంటున్నారు.
ఈతరం హీరోలలో ఎవరు కూడా త్రిపాత్రాభినయం చేసే సాహసాన్ని చేయడం లేదు. కానీ అలాంటి హీరోలు ఉన్న సమయంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు మాత్రమే ఇలాంటి సాహసాన్ని చేశారు. ఒకరు జూనియర్ ఎన్టీఆర్. ఆయన గతంలో జై లవకుశ అనే చిత్రంలో మూడు పాత్రల్లో అద్భుతంగా నటించడం అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో అద్భుతమైన నటనతో కమర్షియల్ గా మరొక విజయాన్ని అందుకున్నాడు.
Also Read: తెలుగు సినిమాలలో రీమిక్స్ చేసిన 20 సాంగ్స్..