దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమాలలో ఆయన భార్యకు నచ్చని సినిమా ఏమిటో తెలుసా?

Ads

తెలుగు సినీ పరిశ్రమలో దర్శక దీరుడుగా పేరు ప్రఖ్యాతలు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇక సినిమాలలో రాజమౌళి చిత్రాలు భిన్నంగా ఉంటాయి. రాజమౌళి ఆయన తెరకెక్కించే సినిమాలను శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతుంటాడు అందుకే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది. రాజమౌళి ఇప్పటివరకు పన్నెండు సినిమాలను తీశారు. ఇక ఆ పన్నెండు సినిమాలు ఒకదాని మించి ఇంకొకటి హిట్ అయ్యాయి.

Ads

రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో మన తెలుగు సినిమాను నేషనల్ లెవల్ తీసుకెళ్ళాడు. గత ఏడాది వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ తో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈమధ్యే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు గాను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు, బెస్ట్ డైరెక్టర్ గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ గెలుచుకుంది. ఆస్కార్‌ అవార్డ్ తర్వాత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ అవార్డు రావడం పై భారతీయ సినీ ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్,బెస్ట్‌ సాంగ్‌ (నాటు నాటు) క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ ను కూడా  గెలుచుకుంది. అది మాత్రమే కాకుండా నాటు నాటు సాంగ్ ఆస్కార్‌ అవార్డ్ కు షార్ట్‌ లిస్ట్‌ కూడా అయింది. ఆస్కార్‌ అవార్డ్ తర్వాత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ అవార్డు రావడం పై భారతీయ సినీ ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్,బెస్ట్‌ సాంగ్‌(నాటు నాటు) క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ గెలుచుకుంది. అది మాత్రమే నాటు నాటు సాంగ్ ఆస్కార్‌ అవార్డ్ కు షార్ట్‌ లిస్ట్‌ కూడా అయింది.
అయితే ఇటీవల రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి తన భర్త రాజమౌళి డైరెక్షన్ చేసిన చిత్రాల్లో ఒక చిత్రం తనకు ఇష్టం లేదని తెలిపారు. ఆశ్చర్యంగా ఉందా మీరు విన్నది నిజమే. అయితే ఆ సినిమా ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఆ మూవీ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన యమదొంగ. జక్కన్నతీసిన యమదొంగ అంటే నచ్చదని ఆమెనే స్వయంగా ఒక ఇంటర్వూలో చెప్పింది. అయితే దానికి గల కారణాలు చెప్పలేనని, యమదొంగ మూవీకి రాజమౌళి దర్శకత్వం తనకు నచ్చలేదు తెలిపింది. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని, ఎన్టీఆర్‌ కారణంగానే ఈ మూవీ హిట్ అయ్యిందని తెలిపింది. ప్రస్తుతం రమా రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్‌ గా మారతాయి.

Also Read: మ‌గ‌ధీర సినిమాలో ఈ సన్నివేశం చూసినప్పుడు మీకు ఇదే సందేహం వచ్చిందా..?

 

Previous articleఎన్టీఆర్ మాట వినిపించుకోని కారణంగా వాణిశ్రీ పరిస్థితి ఎలా అయ్యిందో తెలుసా?
Next articleఖడ్గం మూవీ కోసం నటుడు షఫీ చార్మినార్ వీధుల్లో చేసిన పని ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.