Ads
Thegimpu Movie Review:
నటీనటులు : అజిత్ కుమార్, మంజూ వారియర్, సముద్రఖని, పావని రెడ్డి తదితరులు
నిర్మాత : బోనీ కపూర్, జీ స్టూడియోస్
రచన, దర్శకత్వం : హెచ్. వినోద్
సంగీతం : జిబ్రాన్
రిలీజ్ తేదీ: జనవరి 11, 2023
Thegimpu Movie Review: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ పేరుతో ఈ సినిమాను నేడు విడుదల చేశారు. అజిత్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను హెచ్. వినోద్ తెరకెక్కించారు. ఇంతకు ముందు వీరి కాంబోలో “నేర్కొండ పరవాయ్, వలిమై అనే సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ఇది. అయితే ఈ మూవీతో అజిత్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..
Ads
కథ:
Thegimpu Movie Review: వైజాగ్ లోని యువర్ బ్యాంకులో రిజర్వ్ బ్యాంకు 1000 కోట్ల నగదు ఉంచడానికి పర్మిషన్ ఇస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఆ బ్యాంక్ వారు రూ. 500 కోట్లు డిపాజిట్స్ తీసుకుంటారు. అయితే ఆ మనీ ని కొట్టేయడానికి బ్యాంక్ లో దొంగలు చొరబడతారు. ఆ బ్యాంక్ లో ఉన్న 500 కోట్ల రూపాయలను కొట్టేయాలనే మొదలైన దొంగతనంలోకి డార్క్ డెవిల్ (అజిత్) ఎంటర్ అవుతాడు. ఆ దొంగలను తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు. స్టోరీ నడిచే కొద్ది డబ్బును కొట్టేయాలనుకున్నది ఎవరు? బ్యాంకు బయట ఉండి డార్క్ డెవిల్ కు సపోర్ట్ చేస్తున్న రమణి (మంజూ వారియర్) ఎవరు? అసలు ఎందుకు బ్యాంకులో ఉన్న డబ్బును కొట్టేయాలనుకున్నారు? 500 కోట్లు అనుకుంటే 25 వేల కోట్లకు స్కామ్ ఏ విధంగా బయటకు పడింది? అనేది మూవీ చూసి తెలుసుకోవాలి.
Thegimpu Movie Review: అజిత్ చేసిన పాత్ర నెగెటివ్ షేడ్ రోల్ ‘గ్యాంబ్లర్’ రోజులను గుర్తుకు తెచ్చింది. అజిత్ యాక్టింగ్ లో ఫుల్ ఫైర్ ఉంది. ఆయన నెగెటివ్ షేడ్ పాత్ర వస్తే ఎలా చెలరేగిపోతారో తెలిసిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం అజిత్ విలన్ లా కనిపించే హీరోగా సూపర్ స్టైల్, మేనరిజమ్స్ అద్భుతంగా చూపించారు. ఇక సెకండాఫ్‌లోనూ క్యారెక్టర్ పరంగా ముందుకెళ్లాడు. మంజూ వారియర్ కు దొరికిన స్క్రీన్ స్పేస్ తక్కువే. అయితే ఆమెను సాంగ్స్ కు పరిమితం చేయలేదు. తక్కువ స్క్రీన్ స్పేస్ అయిన మంజూ వారియర్ పెర్ఫార్మన్స్ బాగా చేశారు. సముద్రఖని, అజయ్, తదితరులవి పరిధి మేరకు నటించారు.
బ్యాంకు దొంగతనం బ్యాక్ డ్రాప్ లో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. తెగింపు మూవీ కూడా అదే కోవలో సాగుతుంది. ఓ పోలీసు అధికారి బ్యాంకు దోపిడీ చేసేందుకు ఓ గ్యాంగ్ తో సుఫారీ మాట్లాడుకుంటాడు. అయితే ఇందులోకి ఎవరు ఊహించని విధంగా డార్క్ డెవిల్ అనే గ్యాంగ్ స్టర్ బ్యాంకు రాబరీలోకి ఎంట్రీ ఇస్తాడు. అతను వచ్చినప్పటి నుండి స్టోరీలో చాలా మలుపులు చోటు చేసుకుంటాయి. కానీ డైరెక్టర్ వినోద్ ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తీయడంలో సఫలమయ్యాడు. బ్యాంకులో జరిగే మోసాలను చూపిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లుగా ఈ మూవీ కథ సాగింది. అలాగే ఫైనాన్షియల్ మోసాలు జరిగినప్పుడు తమ ప్రాణాలు తీసుకోకుండా ఆ తెగింపును మోసగించినవారిని నిలదీయండని చెప్పేదే ఈ తెగింపు సినిమా.
ప్లస్ పాయింట్స్:
అజిత్ పాత్ర, నటన
సందేశం
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
స్క్రీన్‌ప్లే
పతాక సన్నివేశాలు
రేటింగ్: 2.25/5
Also Read: దళపతి విజయ్ “వారసుడు” మూవీ రివ్యూ & రేటింగ్