Ads
ఓటిటి లు వచ్చిన తర్వాత ఒక భాషలో రూపొందించిన కంటెంట్ మిగతా అన్ని భాషల్లోకి అందుబాటులోకి వస్తుంది. అయితే ముందు మాతృక భాషలో రిలీజ్ చేసి తర్వాత స్పందన బట్టి ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు.
తాజాగా ఒక తమిళ్ వెబ్ సిరీస్ తెలుగులోకి అనువాదం అయింది. దాని పేరు ఆకాష్ వాణి… ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…!
కథ:
ఒకే కాపేజీలో చదువుతున్న ఆకాశ్ (కెవిన్) వాణి (రెబా మౌనిక జాన్) ప్రేమలో పడతారు. తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుని జీవిస్తూ ఉంటారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో వీరి మధ్య గొడవలు జరుగుతాయి. అయితే ఇక తన భర్తతో కలిసి జీవించలేని అంటూ వాణి విడాకుల నోటీసులు పంపిస్తుంది. ఆ నోటీసులు చూసి ఆకాశ్ షాక్ అవుతాడు. అసలు వాణి ఆకాశ్ మధ్య గొడవలకు కారణమేంటి…? తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనేది..? వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
Ads
కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాల తరహాలోనే ఈ ఆకాశ్ వాణి వెబ్ సిరీస్ కూడా ఉంటుంది. ఈరోజు చదువులో తప్ప మిగతా అన్నిట్లోనూ యాక్టివ్ గా ఉంటాడు. హీరోయిన్ నu చూడగానే ప్రేమలో పడటం… ఆమెకి ప్రపోజ్ చేయడం, ముందు నో చెప్పడం ,తర్వాత యస్ చెప్పడం ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఈ కథ పాతదే అయిన కొత్తగా చెప్పొచ్చు కానీ ఆ విషయంలో ఈ వెబ్ సిరీస్ ఫెయిల్ అయింది. ఓపెన్ చేసిన విధానం బాగానే ఉన్నా తర్వాత నడిపించిన తీరు బోర్ కొడుతుంది.
మొత్తం ఏడు ఎపిసోడ్ లలో ఈ సీరీస్ నడిపించారు. ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాలు డ్యురేషన్ ఉండడం కలిసి వచ్చే అంశం.కొన్ని సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.అయితే కాలేజీలో వచ్చే సన్నివేశాలు వినోదం పంచుతాయి. కొన్ని సన్నివేశాలలో దర్శకుడు ప్రతిభ కనిపిస్తుంది. అయితే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయం చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎమోషన్స్ అంతగా వర్క్ అట అవలేదు. క్లైమాక్స్ మాత్రం బాగా అనిపిస్తుంది.
ఇక ప్రధాన పాత్రధారులు కెవిన్, రెబా మౌనిక జాన్ లు తమ పాత్రలను బాగా పండించారు. ఫ్రెండ్స్ పాత్రులు మంచి కామెడీని పండించాయి. సంగీతం బాగున్న పాటలు ఆకట్టుకునే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ కూడా తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
ఫైనల్ గా: ఎటువంటి అసభ్యతకి తావు లేకుండా క్లీన్ గా ఉన్న వెబ్ సిరీస్. కుటుంబంలో కలిసి ఒకసారి చూడవచ్చు