ఉద్యోగం లేకపోయినా భర్త మనోవర్తి చెల్లించాల్సిందే.. తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు!

Ads

విడాకులు తీసుకున్న భర్తలు ఇకపై సంపాదన లేదు అనే సాకుని చూపించి భరణం ఎగ్గొట్టలేరు. అలహాబాదు హైకోర్టు భర్తకి సంపాదన లేకపోయినా భర్త భరణం చెల్లించాల్సిందే అంటూ సంచలన తీర్పుని ఇచ్చింది. భర్త భరణం ఇవ్వడం లేదంటూ అలహాబాద్ కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. సంపాదన లేదంటూ సదరు భర్త తన వాదన వినిపించాడు. అయితే కోర్టు భర్తకి కూలీగా పని చేసే సామర్థ్యం ఉంది కాబట్టి అలా పని చేసైనా సరే మనోవర్తి చెల్లించాల్సిందే అని ఆదేశించింది. ఈ కేసు యొక్క పూర్తి వివరాలు విందాం.

ఉత్తరప్రదేశ్ కు చెందిన దంపతులకు 2017లో వివాహం అయింది వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారు అంటూ పెళ్లయిన కొన్ని రోజులకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య తర్వాత 2016లో పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది విడిపోయిన భార్యకు మనోవర్తి కింద నెల 2000 చెల్లించాలని ఆదేశించింది. అయితే ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పుని సవాలు చేస్తూ అతడు ఫిబ్రవరి 21 2023లో హైకోర్టును ఆశ్రయించాడు.

Ads

భార్య ఉపాధ్యాయురాలుగా నెలకి 10,000 సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. అంతేకాకుండా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చికిత్స తీసుకుంటున్నట్లు కూడా చెప్పాడు. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఆధారపడ్డారు.

అయితే భార్య పదివేలు సంపాదిస్తుందనే విషయాన్ని కోర్టు ముందు రుజువు చేయలేకపోయాడు. ఇరు వర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు అతడి వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. ఉద్యోగం లేకపోయినప్పటికీ భార్యకు మనోవర్తి చెల్లించాలని స్పష్టం చేసింది కూలీగా రోజుకి 300 నుంచి 400 సంపాదించే వీలుంది కాబట్టి అలా సంపాదించి భార్యకు భరణం చెల్లించమంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

Previous articleబాయ్ ఫ్రెండ్ తో ఓయో కి వెళ్ళింది…కానీ చివరికి శవమై.! అసలేమైంది.?
Next articleముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.