ఈ కాలం పిల్లల్ని ఇలా పెంచాలి.. అల్లు స్నేహ పేరెంటింగ్ టిప్స్!

Ads

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ కుటుంబానికి సంబంధించిన విషయాలని, కొడుకు కూతురుకి సంబంధించిన విషయాలని, వాళ్ళ క్యూట్ ఫొటోస్ ని ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. రీసెంట్ గా స్నేహ మై పేరేంటింగ్ మంత్ర అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఒక ప్రణాళికని ఏర్పరుచుకోవాలని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిల్లల్ని కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించేలాగా ప్రోత్సహించాలి. వారం మొత్తంలో వాళ్ళు చేయాల్సిన పనులకు ప్రణాళిక వేసుకోవాలి, ప్రకృతితో గడిపేలా కాసేపు ఎండలో ఉండాలి, స్క్రీన్ టైం తగ్గించడానికి వారిలో ఊహ శక్తి పెంపొందించే పనులను ప్రోత్సహించాలి. పిల్లలలో జాలీ, కరుణ వంటి గుణాలు పెంపొందించాలి.

అన్నింటికంటే ముఖ్యమైనది తల్లులు తమ కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలి అంటూ అల్లు అర్హ చెప్పిన పేరెంటింగ్ టిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగానే వాళ్ళు స్నేహారెడ్డి మంచి పేరంట్ అని వాళ్ల పిల్లల్ని చూస్తేనే తెలుస్తుంది. మిగిలిన భాషలు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అంటూ పిల్లలిద్దరికీ స్వచ్ఛమైన తెలుగుని నేర్పిస్తున్నారు అల్లు దంపతులు.

సినీ యాక్టర్ గా తండ్రి, బిజినెస్ ఉమెన్ గా తల్లి ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలిద్దరితో క్వాలిటీ టైం మెయింటైన్ చేస్తూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అల్లు దంపతులు. ఇలాంటి సంరక్షణలో పెరిగిన పిల్లలు గొప్పవారవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక స్నేహ ప్రొఫెషనల్ విషయానికి వస్తే పిల్లల్ని చూసుకుంటూనే పికాబు అనే ఫోటో స్టూడియో వ్యాపారం చేస్తుంది. అలాగే ఈ మధ్యనే ఒక యాడ్ లో నటించి అందరిని మెప్పించింది స్నేహ రెడ్డి.

Previous articleయానిమల్ OTT వెర్షన్ లో ఈ సీన్స్ ఎందుకు లేవు..? కారణం ఏంటంటే..?
Next articleఒకప్పటి నక్సలైట్, నేటి పద్మభూషణ్.. 180 ఫ్లాప్స్ ఉన్నా క్రేజ్ తగ్గని ఈ హీరో ఎవరో తెలుసా.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.