Ads
అక్కినేని నాగార్జున, అమల ఎంత పెద్ద హిట్ పెయిర్ అనేది ముందు జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళిద్దరిది రీల్ లైఫ్ లో హిట్ జోడి, తర్వాత రియల్ లైఫ్ లో కూడా హిట్ జోడిగా మారింది. వీళ్ళిద్దరూ గతంలో చాలా సినిమాలలో కలిసి నటించారు. ముందుగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా కిరాయి దాదా, ఆ తర్వాత చిన్న బాబు సినిమాలో నటించారు. ఇక వీళ్ళు కలిసి నటించిన మూడవ చిత్రం శివ.ఈ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిందని చెప్పాలి.
ఇక వాళ్ళిద్దరూ కలిసి నటించిన ఆఖరి చిత్రం నిర్ణయం. ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ ఫుల్ జంటగా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత దాదాపు అమల సినిమాలు చేయడం మానేసి భార్య పాత్రని తల్లి పాత్రని పోషిస్తూ సక్సెస్ఫుల్ ఉమెన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఈ మధ్యనే మళ్లీ నాగార్జునతో కలిసి నటించే అవకాశం “మనం” సినిమా ద్వారా వచ్చింది.
Ads
ఎందుకంటే ఈ సినిమా మూడు తరాల నటులకి సంబంధించిన కధ. ఇందులో నాగార్జునకి జోడిగా ముందు అమలనే అనుకున్నారంట కానీ అమల నిరాకరించడంతో ఆ ప్లేస్ లో శ్రేయ ని తీసుకున్నారు. అయితే అమల ఈ సినిమాలో కనిపిస్తుంది కానీ చాలా చిన్న పాత్రలో కనిపిస్తుంది. అయితే మనం సూపర్ హిట్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు శ్రేయ ప్లేస్ లో అమలు గాని ఉండి ఉంటే సినిమా మరింత హైలైట్ అయ్యేదని వాపోతున్నారు.
ఇదే సినిమా అక్కినేని నాగేశ్వరరావుకి ఆఖరి చిత్రం, అక్కినేని అఖిల్ కి మొదటి చిత్రం కావటం విశేషం. మూడు తరాల నటులు ఒకే సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. అలాంటి సినిమాలో అమల లీడ్ రోల్ చేసి ఉంటే మరింత బాగుండేది అంటున్నారు ప్రేక్షకులు.