అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో శరణ్య చేసిన ఈ సీన్ డిలీట్ చేశారా..? కారణం ఏంటంటే..?

Ads

సుహాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. ఈ సినిమాలో సుహాస్ సరసన హీరోయిన్ గా శివాని నగరం నటించింది.

హీరోకి అక్క పాత్రలో శరణ్య ప్రదీప్ నటించింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్లో శరణ్య నగ్నంగా నటించవలసిన అవసరం ఏర్పడింది. మరొక నటి ఉంటే అభ్యంతరం చెప్పేవారేమో..

ambajipeta marriage band sharanya

కానీ శరణ్య ప్రదీప్ అలాంటి సీన్చేయటానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో నిమ్న వర్గానికి చెందిన యువకుడిగా సుహాస్ కనిపించగా అతని కవల సోదరిగా పద్మ అనే పాత్రను పోషించింది శరణ్య ప్రదీప్.కుల వివక్షకు లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి డైరెక్టర్ దుష్యంత్ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా కథ విషయానికి వస్తే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ లో సభ్యుడిగా పని చేస్తున్న మల్లికి కవల సోదరి పద్మ ఉంటుంది.

Ads

ambajipeta marriage band sharanya

స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న పద్మ ఊరి పెద్దగా చలామణి అవుతున్న వెంకట్ బాబుతో స్కూల్ విషయంలో గొడవపడుతుంది. ఆ గొడవ వల్ల వెంకట్ బాబు చెల్లెలు లక్ష్మీతో సాగిస్తున్న ప్రేమాయణం ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. పద్మను వెంకట్ బాబు వేధిస్తున్న సన్నివేశాలలో భాగంగానే ఈ న్యూడ్ సీన్ చేయవలసి వచ్చిందట, విలన్ తనని వేధించే సమయంలో నగ్నంగా పరిగెత్తే ఒక షాట్ ఉండటంతో డేర్ చేసి ఆ సీన్ లో నటించింది శరణ్య.

అయితే కొన్ని కారణాల వలన ఆ సీన్స్ డిలీట్ చేశారు. అలాగే పుష్ప ఫేం జగదీష్ శరణ్యకి ప్రపోజ్ చేసే సీన్లు కూడా డిలీట్ చేయాల్సి వచ్చిందట. మొత్తానికి చిన్న చిన్న రోల్స్ చేసుకునే శరణ్య ప్రదీప్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఇంకా చెప్పాలంటే హీరో సుహాస్ కన్నా శరణ్య నటన గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు

Previous articleహైదరాబాద్ లో 29 రూపాయల భారత్ రైస్ అమ్మే ఏరియాలు ఏవో తెలుసా..?
Next articleఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హీరో పేరే వినిపిస్తోంది..! ఇతను ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.