Ads
అమ్మ…ఈ పదంలోనే ఒక తీయని మాయ ఉంది. ఎటువంటి వారు అయినా ఈ పదం వింటే ఒక ఎమోషన్ కి గురి అవ్వక మానరు. మరీ ముఖ్యంగా అమ్మ చేతి వంట ఇష్టపడని వ్యక్తి భూమి మీద ఉండడు…అందుకే అమ్మ చేతి వంట అనే పేరుతో ఆవుల భార్గవి మాంచి కూకింగ్ ఛానల్ ద్వారా సక్సెస్ పుల్ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎంత సక్సెస్ఫుల్ అయింది అంటే కొన్ని లక్షల మందికి ఆమె ఛానల్ ఒక ఇష్టమైన వంటిల్లుగా మారింది.
ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ,రాజమండ్రి కి చెందిన భార్గవి.. 2017 జనవరి సంక్రాంతి సందర్భంగా పుట్టింటికి వెళ్ళింది. అదిగో అప్పుడే ఆమె లైఫ్ లో ఒక సరికొత్త టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. ఏదో మాటల మధ్య ఆమె తల్లి గీతామహాలక్ష్మి.. మనం చేసే వంటలను కూడా వీడియో రూపంలో తీసి యూట్యూబ్ లో పెడితే బాగుంటుంది కదా.. నేను వంటలు చేస్తాను నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావా అని అడిగారట.
అప్పుడు ఈ విషయంపై పెద్దగా ఆసక్తి లేని భార్గవి సరేలే చూద్దాం అని మాట వరసకు అనేసింది. ఇక ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్ళాక భర్త, పిల్లలు.. ఇలా భాద్యతల జంఝాటం లో ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. అయితే ఆమె తల్లి మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా యూట్యూబ్ విషయం ఒకసారి ఆలోచించు అని గుర్తు చేస్తూనే ఉండేవారట. సరే తల్లి ఇన్నిసార్లు చెప్తుంది కదా అని ఫైనల్ గా భార్గవి ఈ విషయంపై ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలో తాను తయారు చేస్తున్న వంటకాలు వీడియోలు తీసి సేవ్ చేసుకొని ఆ తర్వాత అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్ ను 2017 మే 31 వ తారీకున ప్రారంభించింది. మొదట ఆశించినంత వ్యూవర్స్ రాలేదు.. సబ్స్క్రైబ్ ని పెంచడం కోసం కాస్త కసరత్తు చేసిన భార్గవి.. ట్యాగ్స్, టైటిల్స్ ఇలా అన్ని విషయాలపై పూర్తి అవగాహనను పెంచుకుంది. ఇక అప్పటినుంచి ప్రొఫెషనల్ గా వీడియోలు పెట్టడం నేర్చుకుంది.
మెల్లిగా వాళ్ళ ఛానల్ క్లిక్ అయింది.. భార్గవి కూడా అందరి మనసులోని అభిరుచులకు తగ్గట్టుగా మంచి రుచికరమైన వంటలు ఆరోగ్యకరంగా చేయడం మొదలుపెట్టింది. అలాగే పండుగలు.. ప్రసాదాలు.. దేవుడికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అనే విషయాలు వీడియోల రూపంలో విడుదల చేయడంతో మంచి స్పందన వచ్చింది. అలా ఒక చిన్న ప్రయత్నమే అమ్మ చేతి వంటగా మారి ఇప్పుడు విపరీతమైన ఆదరణ అందుకుంటుంది.
watch video:
image credits: instagram/bhargaviavula.official/