యానిమల్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టేనా? రేటింగ్ ఎంత అంటే.?

Ads

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం గురించి డిఫరెంట్ గా చూపించబోతున్నారు డైరెక్టర్ సందీప్. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఎప్పుడు రివ్యూ చెబుతూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకునే ఉమైర్ సంధు తాజాగా కూడా యానిమల్ సినిమాకు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ ను కూడా దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. నటీనటుల పెర్ఫార్మన్స్ లు అందరినీ ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. యూత్ ను అవి బాగా ఆకట్టుకుంటాయి అని రాసుకొచ్చాడు ఉమైర్ సంధు.

Ads

అంతేకాకుండా యానిమల్ సినిమాకు ఫైనల్ గా 4/5 రేటింగ్ ను ఇచ్చాడు. ఈ మేరకు అతను చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో కొందరు రన్బీర్ కపూర్ అభిమానులు సినిమా హిట్ అన్న విషయం అందరికి తెలుసు నువ్వేం చెప్పాలి అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, సినిమా అసలు విడుదలనే కాలేదు అప్పుడే నువ్వు రివ్యూ ఎలా చెబుతావు అంటూ కొందరు మండిపడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ సినిమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే అన్న అనుమానం రాక మానదు. మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి..

Previous articleTS ELECTIONS: అన్ని పార్టీల దృష్టి ఆ ఏరియా పైనే…ఆ ఓట్లు ఎవరికో?
Next articleKARTHIKA POURNAMI 2023: కార్తీకపౌర్ణమి శుభ సమయం ఎప్పుడు.? పూజా విధానం… దీపాల ప్రాముఖ్యత ఇదే?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.