Mahesh Babu: మహేష్ కి చెల్లిగా ఆ హీరోయిన్.. ఇదేం కాంబినేషన్ డైరెక్టర్ గారు.?

Ads

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా పనులలో త్రివిక్రమ్ మహేష్ బాబు బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇది ఒక అడ్వెంచరస్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా ఎక్కువగా ఆఫ్రికా అడవులలోనే షూటింగ్ జరుపుకోబోతుందని ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఇదివరకు ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ads

మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలోనే స్కెచ్ వేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో పనిచేసే తారాగణం కూడా ఈయన ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి ఒక సోదరి పాత్ర ఉంటుందని ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే మహేష్ బాబు సోదరిగా నటించడం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఒక హీరోయిన్ ని ఎంపిక చేశారని తెలుస్తుంది.

మరి మహేష్ బాబుకి సిస్టర్ పాత్రలో నటిస్తున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో మహేష్ బాబుకి సిస్టర్ పాత్రలో నటించబోతుందంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు అదేంటి జక్కన్న వీరిద్దరిని బ్రదర్ సిస్టర్ గా మార్చేశావు ఏమైనా కాంబినేషనా ఇది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం అసలు ఇలాంటి ఐడియాలన్నీ మీకే ఎలా వస్తాయి జక్కన్న మీరు మరో లెవల్లో ఆలోచిస్తారుగా అంటూ ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Previous article37 ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే…ఆయన్ని ఓడించి చరిత్ర సృష్టించిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఎవరంటే ?
Next articleCM REVANTH REDDY: “అన్నా” అని పిలవగానే ఆదుకున్నావ్…ఇంకో మెట్టు ఎక్కేసావ్ రేవంత్ అన్నా.! ఏమైందంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.