Ads
తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన సినిమా బాక్. ఈ సినిమా కొంత కాలం క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. తెలుగు కంటే తమిళ్ లో ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. అరణ్మనై సిరీస్ లో భాగంగానే ఈ సినిమా రూపొందించారు. సుందర్ సి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల అయ్యింది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సెల్వి (తమన్నా) ఇంట్లో నుండి పారిపోయి, తను ప్రేమించిన వ్యక్తి (సంతోష్ ప్రతాప్) ని పెళ్లి చేసుకుంటుంది. అడవిలో ఉండే ఒక ఇంట్లో, ఇద్దరు పిల్లలు, భర్తతో సంతోషంగా ఉంటుంది.
ఒకరోజు సెల్వి అన్న శరవణన్ (సుందర్ సి) కి సెల్వి చనిపోయినట్టు, తన ప్రాణాలని తనే తీసుకున్నట్టు వార్త వస్తుంది. తన భర్త చనిపోయాడు అని తెలియడంతో సెల్వి ఇలాంటి పని చేసింది అని వాళ్ళకి అర్థం అవుతుంది. దాంతో శరవణన్, తన బంధువు (కోవై సరళ) తో కలిసి సెల్వి ఉండే ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత, సెల్వి చనిపోవడానికి కారణం ఇంకా ఏదో ఉంది అని అర్థం అవుతుంది. అక్కడే ఉండే లోకల్ డాక్టర్ మాయ (రాశి ఖన్నా) సహాయంతో శరవణన్ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు.
Ads
సెల్వి ఎందుకు చనిపోయింది? తన పిల్లలు ఏమయ్యారు? శరవణన్ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కనిపెట్టగలిగాడా? వాళ్లు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. చంద్రకళ వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆ తర్వాత అదే ఫార్మేట్ లో చాలా సినిమాలు వచ్చాయి. దాంతో ప్రేక్షకులకి ఇలాంటి సినిమాలు కొత్తగా అనిపించట్లేదు. అందులోనూ ముఖ్యంగా హారర్ కామెడీ సినిమాలు అయితే బోర్ కొట్టేసాయి. ఈ సినిమా కూడా చంద్రకళ, కళావతి, ఆ తర్వాత వచ్చిన అంతపురం సినిమా లాగా సాగుతుంది.
ఈ మూడు సినిమాలని తెలుగులో వేరు వేరు పేర్లతో విడుదల చేసినా కూడా తమిళ్ లో అరణ్మనై 1, అరణ్మనై 2, అరణ్మనై 3 సినిమాల పేరుతోనే విడుదల చేశారు. ఇప్పుడు అరణ్మనై 4 భాగాన్ని తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండేలాగా చూసుకున్నారు. ఈ సినిమాలో ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయడానికి ప్రయత్నించారు. బాక్ అంటే ఏంటి అనేదాన్ని ఈ సినిమాలో చూపించాలి అనుకున్నారు. కానీ మధ్యలో మళ్ళీ కమర్షియల్ టెంప్లెట్ కి షిఫ్ట్ అయిపోతుంది.
చాలా మంది కామెడియన్స్ వస్తూ ఉంటారు. హారర్ సినిమాలో అసలు కమెడియన్స్ అవసరం ఏంటి అని ఒక సమయంలో అనిపిస్తుంది. బాక్ అనే కాన్సెప్ట్ మీద సినిమా సీరియస్ గా తీసి ఉంటే ఇంకా బాగా అనిపించేది. సినిమా కోసం ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. కానీ కామెడీ లేకుండా సీరియస్ గా సినిమా ఒకటే పాయింట్ మీద వెళ్లి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అసలు బాక్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.