Ads
వన్డే ప్రపంచకప్ 2023 కోసం బీసీసీఐ సెలెక్టర్లు 15 మందితో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కంటే ముందుగా భారత్ ఆస్ట్రేలియా తో మూడు మ్యాచ్లతో కూడిన వన్డే సిరీస్ ను ఆడబోతోంది.. అయితే ఈ మండే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన తాజా జాబితాలో ఎవరు ఊహించని విధంగా రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించడం జరిగింది. ఈ నిర్ణయం వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ 2023 లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో అతను ఫైనల్ మ్యాచ్లో కూడా ఆడలేకపోయాడు. ఈ కారణం చేత ఆస్ట్రేలియా తో జరగనున్న తొలి రెండు వన్డేలకు అక్షర పటేల్ ను ఎంపిక చేయలేదు. అయితే మూడో వన్డే కి అతని తీసుకున్నారు కానీ తన ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే అతనికి ఈ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Ads
ఈ నేపథ్యంలో అక్షర పటేల్ కోల్పోకపోతే ప్రపంచకప్ సమయానికి అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే రవిచంద్రన్ అశ్విన్ లేక వాషింగ్టన్ సుందర్ ను అక్షర పటేల్ స్థానంలో తీసుకోవాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు ఏదో ఒక గాయంతో బాధపడే రకం. ఈ ఇద్దరిలో పోల్చుకుంటే సుందర కంటే అశ్విన్ మంచి ఛాయిస్ అని భావించిన మెయిన్ కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ… అతనికి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ మ్యాచ్ అతనికి ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగపడుతుంది అనేది వారి ఉద్దేశం. అక్షర పటేల్ కోల్కుంటే పర్లేదు లేనిపక్షంలో అతని స్థానంలో ప్రపంచకప్ కోసం అశ్విన్ ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అశ్విన్ మంచి బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు కాబట్టి ఒత్తిడిని తట్టుకొని ఆడుతాడు. ఆప్షనల్ గా తీసుకున్న ఇన్నాళ్ళకి ప్రపంచకప్ టీం లో ఉండదగిన ప్లేయర్ని ఎంచుకున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.