Ads
అనురాగ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఉమాపతి. ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయింది పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాని సత్య ద్వారపూడి డైరెక్ట్ చేశాడు. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే కొత్తపల్లి కి చెందిన వర ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జులాయిగా తిరిగే వ్యక్తి. అతని జీవితంలోకి అనుకోకుండా దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ఉమా వస్తుంది.
ఆమెతో ప్రేమలో పడతాడు కానీ గుడి విషయంలో రెండు ఊళ్ళ మధ్య ఉన్న గొడవలు కారణంగా ఉమ,వర ల పెళ్లికి ఉమ అన్నయ్య అడ్డు చెప్తాడు. ఈ గొడవల మధ్య ఉమా వర ఒకటయ్యారా? అసలు ఊర్లో గొడవలు కి కారణం ఏమిటి? తన ప్రేమను గెలిపించుకోవడానికి వర చేసిన పోరాటం ఏమిటి అన్నది సినిమా. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీ యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు సత్య ద్వారపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు.
Ads
కధ రొటీన్ అయినా విలేజ్ నేటివిటీ కారణంగా ఫ్రెష్ నెస్ వచ్చింది. హీరో హీరోయిన్లు లవ్ స్టోరీని చాలా రియలస్టిక్ గా స్క్రీన్ పై ఆవిష్కరించాడు డైరెక్టర్. తల్లి కొడుకుల మధ్య ఉండే సన్నివేశాలను కూడా ఎంతో వినోదాత్మకంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు సత్య ద్వారపూడి. ఫస్ట్ హాఫ్ అంతా హీరో అతని ఫ్రెండ్స్ చేసే అల్లరితో సరదాగా సాగుతుంది. విరామంలోనే అసలు కధ మొదలవుతుంది. ఈ సినిమాలో ఒకటి రెండు ట్విస్టులు ఉంటాయి.
కానీ వాటిని కొత్తగా రాసుకుంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ లో అసలు కధంటూ లేకపోవడం సినిమాకి మైనస్ అనిపిస్తుంది. హీరో అనురాగ్ కి ఇది మొదటి సినిమా ఎమోషనల్ సీన్స్ లో కాస్త తడబడినా కామెడీ పరంగా ఓకే అనిపించాడు. కథ కథనాల కోసం అయితే సినిమా రొటీన్ గా ఉంటుంది కానీ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు.