అవికా గోర్ “వధువు” వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

Ads

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ఫేమ్ అవికా గోర్ కి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే బుల్లితెర పై తన సత్తా చాటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా ‘ఉయ్యాలా జంపాలా’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

Ads

పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత  ‘నెట్’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. తాజాగా అవికా గోర్ నుండి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘వధువు’ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అవికా గోర్ బాలనటిగా బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పెద్దయ్యాక హీరోయిన్‍గా మారిన అవిక అటు సినిమాలలో నటిస్తూనే. మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అలరిస్తున్నారు. ఆమె లీడ్ రోల్ లో నటించిన ఫ్యామిలీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వధువు’. డిసెంబర్ 8 నుండి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. నందు, అలీ రేజా కీలక పాత్రలలో నటించారు. బెంగాలీ వెబ్ సిరీస్ అయిన ‘ఇందు’ కు రీమేక్ గా తెరకెక్కింది.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఇందు (అవికా గోర్) తెలివైన చదువుకున్న అమ్మాయి. తల్లిదండ్రులు చూసిన వివాహనికి అంగీకరిస్తుంది. కానీ పెళ్ళిరోజే ఇందు సొంత చెల్లెలు వరుడితో వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆనంద్ (నందూ)తో పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ, ఆ పెళ్లికి కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. చివరికి ఇందూ, ఆనంద్ ల పెళ్లి జరుగుతుంది. పెళ్లి తరువాత అత్తవారింట్లో అడుగుపెట్టిన ఇందుకి ఎన్నో అనుమానాలు కలుగుతాయి.
ఇందు అనుమానించేలా పలు ఘటనలు ఎదురవుతాయి. ఇందుకు బదులు ఆమె ఆడపడుచు పై ఎవరో హత్యాప్రయత్నం చేస్తారు. అది చేసింది ఎవరు? ఆనంద్ తమ్ముడు ఆర్య (అలీ రేజా) భార్య వైష్ణవితో విడిపోవడానికి కారణం ఏమిటి? ఆమె ఎక్కడ ఉంది? అతడికి పెళ్లి జరిగిన విషయాన్ని ఇందు వద్ద ఎందుకు దాచారు? ఆ ఇంట్లో సందేహాస్పద ఘటనలకు కారణం ఎవరు? అనేది మిగిలిన కథ.

Also Read: లేడీ సూపర్ స్టార్ సినిమా ఇంత సైలెంట్ గా రిలీజ్ అయ్యిందా..? ఎలా ఉందంటే..?

 

Previous articleడాక్టర్ కి కూడా ఈ కష్టం తప్పలేదా..? సరిగ్గా పెళ్ళికి ముందు..?
Next articleఅసలు ఎవరు ఈ శ్రీధర్ బాబు..? తెలంగాణ కొత్త IT మినిస్టర్ రాజకీయ ప్రస్థానం ఇదే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.