Ads
వరుస విజయాలతో వన్డే ప్రపంచ కప్ లో దూసుకుపోతున్న టీం ఇండియాలో కీలకమైన ఆటగాడు హార్దిక్ పాండ్యా అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఒకపక్క బౌలింగే కాక మరోపక్క బ్యాటింగ్ లో కూడా బాగా రాణిస్తున్న హార్దిక్ ప్రస్తుతం జట్టులో మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్. అయితే ఈ సమయంలో అతను గాయం పాలు కావడం టీం కి కాస్త ప్రతికూల అంశమే అవుతుంది. రేపు 29న టీమిండియా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కు హార్దిక్ అవసరం ఎంతో ఉంది అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ హార్దిక్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కూడా హార్దిక్ దూరమయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ కు అందుకుంటాడు అనుకునే సమయంలో అతను మరిన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండవచ్చు అనే వార్త ప్రస్తుతం వైరల్ అయింది. గాయం తీవ్రంగా ఉండడంతో కోలుకోవడానికి మినిమం రెండు వారాలు పట్టవచ్చు. ఈ నేపథ్యంలో నవంబర్ 2 న శ్రీలంకతో జరిగే మ్యాచ్ అలాగే నవంబర్ 5 న దక్షిణ ఆఫ్రికా తో జరిగే మ్యాచ్ లలో హార్దిక్ పాల్గొని అవకాశం చాలా తక్కువ.
Ads
ప్రస్తుతం హార్దిక్ ను నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం ట్రీట్మెంట్ చేస్తోంది. ప్రస్తుతం హార్దిక్ కు టీమిండియాలో రీప్లేస్మెంట్ లేదు అనే చెప్పాలి. అయితే మరోపక్క అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో తన సత్తా చూపించిన అక్షర్ కే రోహిత్ ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. 27 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఇటు బాటింగ్ లోను మంచి ఫార్మ్ లో ఉన్నాడు అక్షర్ పటేల్. వరల్డ్ కప్ కి ముందు కూడా టీం ఇండియాలో అతని స్టాట్స్ బాగున్నాయి. ఇప్పటివరకు వరుస విజయాలతో వస్తున్న టీం ఇండియా అదే కంటిన్యూ చేయాలి అని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.
సూర్య కంటే ఇతనే బెటర్ అంటారా.? పైగా బౌలింగ్ కూడా.? 🤔🤔