బాలకృష్ణ క‌ట్నం ఎంత తీసుకున్నారు..! ఆయన భార్య ఎవ‌రి కూతురో తెలుసా?

Ads

Balakrishna: తెలుగు వెండితెర పై తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసిన నటుడు ఎవరంటే వినిపించే ఏకైక పేరు నందమూరి తారక రామారావు. వెండితెర పై ఆయన చేయని క్యారెక్టర్ కానీ, వేయని వేషం లేదు. NTR కి ఏడుగురి సంతానం. వీరిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. పదకొండు మందిలో చిన్న‌వాడు బాలకృష్ణ.

NTR వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు అగ్ర నటుడిగా కొనసాగుతున్నాడు. NTR ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌గా ఆయన భార్య బ‌స‌వ‌తార‌కం బాలకృష్ణ పెళ్లి కోసం ఆయన పై ఒత్తిడి తీసుకురాగా, అప్పటికే ఎన్నిక‌ల ప్రచారంలో బిజీగా ఉన్న NTR ఈ పనిని త‌న స్నేహితుడైన నాదెండ్ల భాస్కర రావుకు అప్ప‌గించాడ‌ట‌. అయితే భాస్క‌ర రావు త‌న చుట్టమైన దేవ‌ర‌ప‌ల్లి సూర్యారావు కూతురు వ‌సుంధ‌రను చూపించారు.
వ‌సుంధ‌ర అంద‌రికీ న‌చ్చ‌డంతో 1982 డిసెంబర్ 8న నందమూరి బాలకృష్ణకి వసుంధరా దేవితో వివాహం జరిగింది. దేవరపల్లి సూర్యరావు శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ కు అధినేత. సహజంగానే వసుంధర దేవి కోట్ల ఆస్తికి వారసురాలు. ఆమె గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత నందమూరి బాలకృష్ణతో వివాహం జరిగింది. బాలయ్య పెళ్లికి క‌ట్నంగా ఏమి తీసుకోలేద‌ట. వసుంధర తండ్రి కూతురికి బహుమతిగా హైదరాబాద్ లో పది ల‌క్ష‌ల రూపాయ‌లతో ఇంటిని క‌ట్టించారంట ఆరోజుల్లోనే.

Ads

నందమూరి బాల‌కృష్ణ, వ‌సుంధ‌ర‌ దేవిల‌కు ముగ్గురు పిల్లలు. కూతుర్లు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని,కొడుకు మోక్ష‌జ్ఞ‌. నారాలోకేష్ తో పెద్ద కూతురు బ్రాహ్మ‌ణి వివాహం అయ్యింది. రెండవ కూతురు తేజ‌స్విని వివాహం గీతం యూనివ‌ర్సిటీ ఎండి. శ్రీభ‌ర‌త్ తో అయ్యింది.

Also Read: ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి చేతిరాతని చూసారా..? అచ్చం ప్రింటింగ్ లాగే వుంది..!

Previous articleతాడేపల్లిగూడెం సభలో బాలకృష్ణ మాట్లాడే ముందు… పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చారు..? కారణం ఇదేనా..?
Next article“పవన్ కళ్యాణ్” కి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..? కానీ సినిమాల సమయంలో..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.