సినిమా హీరో స్టైల్ లో వెళ్లి… కారులోనే పెళ్లి..! కానీ చివరికి సినిమాని మించిన ట్విస్టులు.! ఏమైందంటే.?

Ads

ఈ మధ్య కాలంలో యువతి యువకులు పెద్దలను ఎదిరించి మరీ ప్రేమించినవారిని పెళ్లి చేసుకుంటున్న వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలలో కొందరిని వారి  పెద్దలు ఆశీర్వదిస్తున్నారు.

ప్రేమ పెళ్ళిళ్ళలో  ఎక్కువ శాతం జంటలవి కులాంతర వివాహాలు ఉంటున్నాయి. అయితే కులాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ విషయం నచ్చక పోవడంతో పరువు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఆలాంటి వార్తలు కూడా వైరల్ అవడం తెలిసిందే. తాజాగా ఓ ప్రేమ జంట సినిమాలలో వలె కారులోనే పెళ్లి చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..కర్ణాటకలోని బళ్ళారికి చెందిన ప్రేమ జంట పెళ్లి సినిమా స్టోరీని తలపించింది. యువజంట ప్రేమ పెళ్లి  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేజీఎఫ్ స్టార్ యాష్ నటించిన ‘కిరాతక’ అనే కన్నడ మూవీలో హీరోయిన్ ని కారులోనే ప్రేమ పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. తాజగా వారి లాగే ప్రేమ జంట కారులోనే పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. డిప్లొమా చేస్తున్న శివప్రసాద్, డిగ్రీ చేసిన అమ్రతలు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు జిల్లాలు, వేర్వేరు కులాలకు చెందినవారు.
అందువల్ల వీరి పెళ్లికి రెండు వైపులా పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఆ జంట కిరాతక మూవీలో మాదిరిగానే కారులో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి వారి పెద్దలు అభ్యంతరాలు చెప్పడంతో ఆ జంట పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఆ జంట మేజర్లు కావటంతో పోలీసులు వారి పెళ్ళికి మద్ధతు తెలిపారు. అయితే ఆ సమయంలోనే అమ్రత తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడారు. దాంతో ఆమెఆలోచనలో పడింది. ముందు భర్త కావాలని చెప్పిన అమ్రత, తల్లిదండ్రులు మాట్లాడిన అనంతరం తల్లిదండ్రులే కావాలని చెప్పింది.
దీంతో శివప్రసాద్ తన భార్యను దక్కించుకోవడానికి ప్రయత్నించడంతో స్టేషన్ లో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇద్దరి తల్లిదండ్రులకు గొడవ జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లాడానికి ప్రయత్నించగా అమ్రత భర్త కావాలి అంటూ కేకలు వేసింది. అప్పటికే రాత్రి కావడంతో నెక్స్ట్ డే మాట్లాడతామని పోలీసులు పంపించారు. ఆ తర్వాతి రోజు వచ్చిన అమ్రత ఇష్టపూర్వకంగానే శివప్రసాద్ పెళ్లి చేసుకున్నట్లు, తన భర్తతో పాటు వెళతానని పోలీసులకు చెప్పింది.  పోలీసులు ఇరు వైపులా వారి నుండి వీడియో రికార్డు చేసి, శివప్రసాద్ తో అమ్రతని పంపించారు.

Ads

Also Read: “హిట్ అండ్ రన్” చట్టం అంటే ఏమిటి..? దేశవ్యాప్తంగా డ్రైవర్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు..?

 

Previous articleఇదేం చీరకట్టు అంటూ “దేవర” హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..!
Next article“అవికా గోర్” నటించిన ఈ పల్లెటూరి ప్రేమకథ ఎలా ఉంది.? స్టోరీ ఏంటి.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.