గూఢచారి 2 లో హీరోయిన్ ఈమెనే…చూడడానికి శోభిత ధూళిపాళ్లలానే ఉందిగా..! ఎవరంటే.?

Ads

హీరో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘గూఢచారి’ మూవీ సంచలన విజయం సాధించింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శశికిరణ్ తిక్క డైరెక్షన్ చేయగా, అడివి శేష్ కథ రాశారు. ఈ మూవీ అడివి శేష్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది.

చిన్న చిత్రంగా రిలీజ్ అయిన ‘గూఢచారి’ మూవీ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ గా ‘G2’ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ ఎవరో తాజాగా ప్రకటించారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
2018లో వచ్చిన గూఢచారి యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీ తర్వాత రెండో పార్ట్ వస్తుందని చాలా రోజుల పాటు వార్తలు వినిపించాయి. దాదాపు 5 ఏళ్ల ఐదేళ్ల తర్వాత సీక్వెల్ ను ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రంలో అడివి శేష్ పక్కన నటించబోయే హీరోయిన్ గా బనితా సంధును ప్రకటించారు.
ఆమెకు స్వాగతం చెబుతూ హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు. అందులో ఇప్పటి వరకు ఇంగ్లిష్, హిందీ చిత్రాలు చేసిన బనిత ఈ మూవీతో తెలుగులోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. బనితా సంధు వేల్స్‌లో బ్రిటీష్ ఇండియన్ ఫ్యామిలిలో పుట్టి పెరిగారు. కింగ్స్ కాలేజ్ లండన్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీని చేయడానికి 18 ఏళ్ళ వయస్సులో లండన్‌కు వెళ్లారు. ఆమె 11 ఏళ్ళ వయస్సు నుండే నటించడం మొదలుపెట్టింది.
2018 లో అక్టోబర్ అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత 2019 తమిళ చిత్రం ఆదిత్య వర్మ మరియు ఆంగ్ల టెలివిజన్ సిరీస్ ‘పండోర’ లో నటించింది. ఆమె ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, పంజాబీ భాషలలో సినిమాలు చేస్తున్నారు. ‘G2′ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బనితా సంధు చూడటానికి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వలె కనిపిస్తోంది. ఈ విషయమై నెట్టింట్లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Ads

Also Read: మొదటి పార్ట్ హిట్…కానీ ఈ సైడ్ B ని ఎందుకు సైడ్ చేసేసారు ఆడియన్స్.? ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదేనా.?

 

Previous articleTS ELECTIONS 2023 :తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 5 మంది యువ నారీమణులు ఎవరో తెలుసా.?
Next article20 ఏళ్ల తర్వాత “కమల్ హాసన్” తో మళ్ళీ జతకడుతున్న హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.