ఆఫీస్ లో వివాహం.. ఆయ‌న ఓ IAS… ఆమేమో IPS … ఇలాంటి అందమైన ప్రేమ కథ ని ఎప్పుడు విని వుండరు..!

Ads

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుంది అనేది ఎవరు చెప్పలేము. పైగా ప్రేమ లో పడ్డాక ఆ ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఊహించలేము. ఇంకేంటి పెళ్లి చేసుకుంటాము అని అనుకున్న ప్రేమికులు ఏ సందర్భంలో అయినా విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏమో పెళ్లి అవుతుందా లేదా అని సందేహం కలిగిన జంటలు కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

అయితే నిజంగా ప్రేమ ఒక మాయ. ఏ క్షణం ఎలా మారుతుంది అనేది మనం చెప్పలేము. పైగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు.

ఇది నిజమేనేమో అని ఇలాంటి ప్రేమ కధలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రేమ కథ చూస్తే చాలా కొత్తగా విచిత్రంగా ఉంది. ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్. వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ ప్రేమకథని చూద్దాం. 2015 బ్యాచ్ ఐఏఎస్ తుషార్ సంగ్లా. 2018 కేడర్ ఐపిఎస్ నవజోత్ సిమి. ఇద్దరు ఎప్పుడు కలుసుకో లేదు. ఇద్దరిది పంజాబ్ ఏ. పైగా నవజోత్ చాల అందమైన అమ్మాయి. బిడిఎస్ చేసింది తరవాత డెంటిస్ట్ గా కెరీర్ ని కూడా స్టార్ట్ చేసింది కానీ అంతా పెళ్ళెప్పుడు అని అడగడంతో ఈమె సివిల్స్ కోచింగ్ తీసుకుని.. ఐపీఎస్ లో సక్సెస్ పొందింది.

Ads

ఓ సారి వీళ్ళు డ్యూటీ లో వున్నప్పుడు కలిశారు. అభిరుచులు, అభిప్రాయాలు కలిసాయి. ప్రేమ మొదలైంది. నవజోత్ పాట్నాలో పని చేస్తుంటే…తుషార్ కోల్కతా లో ఉండే వారు. డ్యూటీ కి ఇంపార్టెన్స్ ఇచ్చే తుషార్ కి పంజాబ్ వెళ్లేందుకు కాళీ ఏ ఉండేది కాదు. ఇక నవజోత్ పాట్నా నుండి వెళ్లి ఆఫీస్ లోనే ఇరు కుటుంబాల సమక్షం లో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలయ్యాక కేడర్లు మార్చుకుని ఒకే రాష్ట్రంలో పని చేసేలా కుదుర్చుకుని అప్పుడు రిసెఫ్షన్ చేసుకున్నారు.

Previous articleఈసారి ఆంధ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్న 5 మంది మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు వీళ్లే.!
Next articleస్వాతంత్ర పోరాటం సమయం నాటి పెళ్లి ఆహ్వాన పత్రిక… పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.