చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడం వల్ల “భారత్” కి కలిగే లాభాలివే…!

Ads

ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఆశగా చూస్తోంది…ప్రపంచ దేశాలు సాధించలేనిది మన ఇస్రో సాధించి చూపించింది. ఇప్పటివరకు ఎవరు పరిశోధించినటువంటి చంద్రుడి యొక్క సౌత్ పోల్ పై చంద్రయాన్ 3 ను స్మూత్ లాంచ్ చేసి…భారత్ పేరు దశదిశల మారుమోగేలా చేసింది. అయితే ఈ మిషన్ సక్సెస్ అవ్వడం వల్ల ఇండియాకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

ఈ విజయంతో ఇండియన్ యొక్క రీసెర్చ్ మరియు ఇంజనీరింగ్ టెక్నాలజీ సత్తా ఎటువంటిదో అందరికీ తెలిసింది. ఇప్పటివరకు చంద్రునిపై తమ స్పేస్ షిప్లను లాంచ్ చేసిన యూఎస్, చైనా, రష్యా క్లబ్లో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు ఒక ఆకర్షించడంతో ఇప్పుడు ఇండియాకు ఆర్థికపరమైన పురోగతి కూడా సాధ్యమవుతుంది.

Ads

ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి మూన్ ఎకానమీ కోణంలో చంద్రయాన్ 3 సక్సెస్ భారత్ ను నడిపిస్తుంది. రాబోయే రోజులలో చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే వనరుల అన్వేషణ దృశ్య చంద్రయాన్ 3 ఇండియాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సక్సెస్ తో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ పై మిగిలిన దేశాల పెట్టుబడి కూడా పెరిగే అవకాశం ఉంది.

ఈ మిషన్ సక్సెస్ సాధించడం ద్వారా సౌత్ ఫోన్లో చంద్రుడిపై వాతావరణ అధ్యయనం దగ్గర నుంచి భూ అధ్యయనం వరకు మొత్తం డేటా ఇండియా దగ్గర ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు విఫలమైన చంద్రయాన్ 2 నుంచి లోపాలను గమనించి తద్వారా చంద్రయాన్ 3 ను సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేయగలిగారు మన ఇస్రో శాస్త్రవేత్తలు.

Previous article“మెహర్ రమేష్” తో పాటు… టాప్ హీరోలతో సినిమాలు చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోయిన 5 డైరెక్టర్స్..!
Next articleKing Of Kotha Review : “దుల్కర్ సల్మాన్” నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ హిట్టా..? ఫట్టా..?