Ads
ఈ మధ్య కాలంలో చాలామంది ఇల్లు, ల్యాండ్ వంటి ఆస్తులను తమ భార్య పేరు పైనే కొనుగోలు చేస్తున్నారు. సామన్యుల నుండి సెలబ్రిటీలు వరకు కూడా దాదాపు ఈ విధంగానే చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చాలా సాధారణం అయిపోయింది.
అయితే ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలో స్త్రీలకు ప్రత్యేక టాక్స్ మినహాయింపులు లభిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వారు తమ భార్య పేరు మీద ఆస్తిని కొంటున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదంటే ఇల్లు కట్టేటప్పుడు, వారి భార్య పేరు పైన గృహ రుణం తీసుకోవడం వల్ల తక్కువ వడ్డీ రేట్లకే లోన్ లభిస్తుంది. దీనివల్ల వారికి అధిక ప్రయోజనం కలుగుతుంది. గృహ రుణాలపై మహిళలకు 0.5 శాతం తక్కువ వడ్డీ రేటును పొందవచ్చు. అందువల్ల, మహిళల పేరు మీద ఇంటిని కొనడం లాభదాయకంగా ఉంటుంది. మహిళల పేర్ల మీద ఆస్తి కొనుగోలు చేసినట్లయితే, స్టాంప్ డ్యూటీలో తగ్గింపు ఉంటుంది.
పలు రాష్ట్రాలలో భార్య పేరు మీద, ఇల్లు, ఫ్లాట్ వంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించే పద్ధతి ఎక్కువగా ఉంది. ఇలా చేయడం వల్ల ఆస్తికి సంబంధించిన ఆదాయపు పన్ను భారాన్ని, తగ్గించుకోవచ్చు. భార్య పేరు మీద ఆస్తి కొనడం వలన ఇలాంటి ప్రయోజనం కలుగుతుంది. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ పై పాక్షిక మాఫీని కూడా అందిస్తున్నాయి. అందువల్ల కొనుగోలుదారులు ఎక్కువగా భార్య పేరు పైనే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.
ఇక భార్య రిజిస్టర్ ఓనర్ గా ఉంటే, రిజిస్ట్రేషన్ కు అయ్యే ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇలా, మహిళల పేరు మీద ఆస్తి కొనడం వలన డబ్బు ఆదా అవుతుంది. అంటేకాకుండా భార్యకు సాధికారత కల్పించినట్టు అవుతుంది. మహిళల పేరు మీద ఆస్తి కొనడం వల్ల పన్ను రాయితీలు, స్టాంప్ డ్యూటీ ఖర్చు తగ్గింపు, ఇంటి లోన్ కు వడ్డీ రేట్లు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
Also Read: “ఇంత గొప్ప భార్య మాకు కూడా కావాలి..!” అంటూ… ఈ మహిళపై కామెంట్స్..? అసలు విషయం ఏంటంటే..?