Ads
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలాకి అప్పగిస్తారని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వైభవం వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సిన అంశం.
2019 ఎన్నికలకు ముందు షర్మిల వైఎస్ఆర్సిపిలో కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టు గా పార్టీలో షర్మిల బాధ్యతలు వహించారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో షర్మిల ముందుండి పార్టీని నడిపించిన విషయం గుర్తు చేసుకోవాలి. అలాగే 2019 ఎన్నికల్లో జగన్ తరఫున తీవ్రంగా ప్రచారం చేసి గెలుపు అందేలా కృషి చేశారు. తర్వాత షర్మిల కి జగన్ కి వేబేధాలు రావడంతో ఆమె తెలంగాణ వచ్చేసి వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు.
Ads
అయితే తెలంగాణలో ఆమెకి ఆదరణ కరువైంది. పాదయాత్రలు చేసిన,దీక్షలు చేసిన అంతగా స్పందన రాలేదు. అయితే తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు షర్మిల. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందని అంశం పైన విశ్లేషకులు మాట్లాడారు.
షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరి వచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ లేకపోవడంతో జగన్ వెంటనే నడిచిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇప్పుడు షర్మిల వైపు వస్తారా అంటే పూర్తిగా చెప్పలేని విషయం. షర్మిల రాక ఎవరికి నష్టం చేకూరుతుందని అంశం పైన మాట్లాడితే… ఎంతో కొంత వైయస్ఆర్సీపీకి జగన్ మోహన్ రెడ్డికే నష్టం వస్తుందని టిడిపి జనసేనకి షర్మిల వల్ల ఎటువంటి నష్టం చేకూరడదని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లు వచ్చాయి. షర్మిల వల్ల ఆ ఓటు శాతం మహా అయితే 5శాతం పెరుగుతుంది తప్ప, అంతకు మించి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేది లేదని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. షర్మిల రాక అనేది కాంగ్రెస్ కి ఎంత మేలు చేకూరుస్తుందో రాబోయే ఎన్నికల చెబుతాయి.