Ads
బెంగళూరులోని ప్రముఖ మాల్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో వయసు పైబడిన ఒక వ్యక్తి చాలా సేపుగా ఎందుకో ఎదురుచూస్తున్నాడు. అంతలో ఒక మహిళ వెనుకగా వెళ్ళి అసభ్యంగా ఆమెను తాకి అక్కడ ఉన్నవారిలో కలిసిపోయాడు.
ఇదంతా గమనించిన ఒకరు రికార్డు చేసి నెట్టింట్లో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో బెంగళూరు పోలీసులు ఆ వ్యక్తిని వెతికే పనిలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినపుడు అప్రమత్తంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
Ads
బెంగళూరులోని లూలు మాల్‌లో ఫ్యామిలితో కలిసి జయప్రకాష్ (30) అనే వ్యక్తి షాపింగ్ కి వెళ్ళాడు. అక్కడ అతనికి అతని సిస్టర్ ఒక వ్యక్తిని చూపి, అతను లేడీస్ ను టచ్ చేస్తున్నాడు అని చెప్పింది. ముందు అతను పట్టించుకొకపోయినా, ఆ వ్యక్తిని గమనిస్తే కావాలనే ఆడవాళ్లను టచ్ చేస్తున్నట్టు అర్థమైంది. ఆ మహిళలు రద్దీగా ఉండటంతో పొరపాటున తగిలాడు అనుకోని వెళ్లిపోతున్నారు.
జయప్రకాష్ కెమెరాతో ఆ వ్యక్తి చేసే పనిని వీడియో తీసి, మాల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. మాల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తి పై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలలో అతన్ని గుర్తించి షాక్ అయ్యారు. దానికి కారణం ఆ వ్యక్తి రిటైర్డ్ హెడ్‌మాస్టర్. ఎనిమిది నెలల కిందటే రిటైర్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు వెళ్లకముందే ఆ వ్యక్తి ఫ్యామిలితో సహా తాళం వేసి వెళ్లిపోయాడు. పోలీసులు అతన్ని వెతుకుతున్నారు.
మహిళలు బహిరంగ ప్రదేశాలలో గొడవ ఎందుకు అనుకోకుండా ఈ విధంగా అసభ్యంగా టచ్ చేసేవారిని వెంటనే ఆపాలి. దృష్టి ద్వారా, మాటల ద్వారా ఇలాంటి వ్యక్తులను ఒక్క క్షణంలోనే అపవచ్చు. హెల్ప్ తీసుకుని వారిని పోలీసులకు అప్పగించవచ్చు. తెలియని వ్యక్తులు అస్తమానం తాకుతూ ఉంటే కూడా వారికి మొహమాట పడకుండా చెప్పేయాలి. ప్రధానంగా పిల్లలకు బహిరంగ ప్రదేశాలలకు వెళ్ళినపుడు ఎవరినీ టచ్ చేయకుండా చూసుకోవాలని హెచ్చరించాలి.
ఇలా మహిళలను టచ్ చేయాలని చూసే మగవారు ఎవరి ఇంట్లో అయినా ఉండవచ్చు. అందువల్ల ఇంటి మహిళలు మాటల్లో మాటగా బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా తమను టచ్ చేస్తే ఎంత కంపరంగా ఉంటుందనే విషయాన్ని చెబుతుండాలి. అలాంటివారిని పబ్లిక్‌గా దండిస్తే వారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ఎంత అవమానంగా ఉంటుందో కూడా వివరించాలి. స్త్రీలను గౌరవించాలని, వారిని ఇబ్బంది పెట్టె పనులు చేయకూడదని చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఇంట్లో ఒప్పుకోకపోయినాసరే పెళ్లి చేసుకున్నారు.. కంటతడి పెట్టిస్తున్న యువతి గాధ.!