Ads
సినిమాలతో సమానంగా ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకుల జీవితాల్లో నాటుకుపోయినవి సీరియల్స్. సీరియల్స్ అంటే ఇప్పుడు కామెడీ అయిపోయాయి. వాళ్లు సీరియస్ గా చేసినా కూడా ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారు. కానీ గతంలో సీరియల్స్ మంచి కాన్సెప్ట్ తో వచ్చేవి. బలమైన కంటెంట్ ఉండేది. కొన్ని డ్రామా ఎక్కువగా ఉన్న సీరియల్స్ వచ్చేవి. వాటితో పాటు సింపుల్ గా ఉండే సీరియల్స్ కూడా వచ్చేవి. అమ్మమ్మ డాట్ కాం, రాధా మధు, అమృతం, నాన్న ఇలాంటి సీరియల్స్ ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. కానీ ఇటీవల కాలంలో సీరియల్స్ క్వాలిటీ మారిపోయింది. ప్రతి సీరియల్ లో లాజిక్ లేని సీన్స్ ఉంటున్నాయి.
కథ తక్కువ డ్రామా ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒక డబ్బింగ్ సీరియల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందీలో దియా ఔర్ బాతి హమ్ పేరుతో వచ్చిన ఈ సీరియల్, తెలుగులో ఈ తరం ఇల్లాలు పేరుతో వచ్చేది. ఐపీఎస్ కావాలి అనుకునే ఒక అమ్మాయి అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయిని ఒక హల్వాయి, అంటే స్వీట్ షాప్ ఓనర్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ విషయం ఆ అమ్మాయికి తర్వాత తెలుస్తుంది. పెళ్లి చేసుకొని వెళ్లిన అత్తగారింట్లో ఏమో చదువుకోవడం అనేది నేరంతో సమానం. కానీ భర్త తన భార్య ఐపీఎస్ అవ్వాలి అనుకుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆమెని ఐపీఎస్ చేస్తాడు.
Ads
ఇందులో హీరోయిన్ సంధ్య పాత్రలో దీపికా సింగ్ నటించగా, హీరో సూరజ్ పాత్రలో అనాస్ రషీద్ నటించారు. హిందీలో కొన్ని సంవత్సరాల వరకు టిఆర్పి రేటింగ్స్ లో ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంది. తెలుగులో కూడా మంచి రేటింగ్స్ సంపాదించుకుంది. హీరోయిన్ కి ఒక లక్ష్యం ఉండడం, అది చేరుకోవడానికి హీరోయిన్ కృషి చేయడం అనేది చాలా తక్కువ సీరియల్స్ లో చూపిస్తారు. ప్రతి సీరియల్ లో హీరోయిన్ కి ముందు లక్ష్యం ఉంటుంది. కానీ ఆ తర్వాత దాని గురించి మర్చిపోతారు. కానీ ఈ సీరియల్ లో మాత్రం మొదటి నుండి చివరి వరకు హీరోయిన్ ఐపీఎస్ అవ్వడం అనే విషయం మీద నడుస్తుంది.
ఇదే సీరియల్ ని తెలుగులో జానకి కలగనలేదు పేరుతో రీమేక్ చేశారు. దీనికి కూడా మంచి ఆదరణ లభించింది. కానీ కొంత కాలంలోనే ఈ సీరియల్ అయిపోయింది. కానీ హిందీలో వచ్చిన సీరియల్ మాత్రం చాలా సంవత్సరాలు సాగింది. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ రానే రావట్లేదు. ప్రతి సీరియల్ లో, హీరోని ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడడం, అందులో ఒక అమ్మాయి అమాయకురాలు అవ్వడం, ఇంకొక అమ్మాయి విలన్ అవ్వడం వంటివి జరుగుతున్నాయి. లేదు అంటే అత్త కోడలు డ్రామాలు ఉంటూనే ఉంటాయి. వీటి మీద సీరియల్స్ వస్తున్నాయి.