KALASHA REVIEW : భానుశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?

Ads

టైటిల్‌: కలశ
నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు
నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం:కొండా రాంబాబు
సంగీతం: విజయ్‌ కురాకుల
సినిమాటోగ్రఫీ:వెంకట్‌ గంగధారి
ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ
విడుదల తేది: డిసెంబర్‌ 15, 2023
కథేంటంటే..
తన్వి(భానుశ్రీ) ఓ హారర్‌ సినిమాను తెరకెక్కించాలనుకుంటుంది. ఇందుకోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని నిర్మాతను కలుస్తుంది. అతను కథ మొత్తం విని క్లైమాక్స్‌ మార్చమని సలహా ఇస్తాడు. దీంతో తన్వి హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితురాలు కలశ(సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి కలశ అక్కడ ఉండదు. తన్వి కాల్‌ చేస్తే.. పని మీద బయటకు వెళ్లాలని.. కాస్త లేట్‌గా వస్తానని చెబుతోంది. తన్వి ఒక్కతే ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు అచ్చం తన్వి రాసుకున్న కథలోని ఇల్లు మాదిరే ఉంటుంది. తన కథలో ఉన్న కొన్ని సీన్లే తన కళ్లముందు రిపీట్‌ అవుతాయి.

ఓ వ్యక్తి ఆమె కదలిలను దొంగచాటున గమనిస్తుంటాడు. అలాగో ఇంట్లో మరోకరు తన్వికి కనిపించకుండా తిరుగుతుంటారు. కలశ చెల్లి అన్షు(రోషిణి కామిశెట్టి) తనను ఆట పట్టిస్తుందని తన్వి భావిస్తుంది. కట్‌ చేస్తే.. మరుసటి రోజు తన్వికి ఓ నిజం తెలుస్తుంది. కలశ, అంజు ఇద్దరూ రెండు నెలల క్రితమే చనిపోయారని, ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. మరి తన్వికి ఫోన్‌ కాల్‌ చేసిందెవరు? అంజు, కలశ ఎలా చనిపోయారు? కలశ నేపథ్యం ఏంటి? రచయిత రాహుల్‌(అనురాగ్‌)తో ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోణి మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి? సస్పెండ్‌ అయిన సీఐ కార్తికేయ(రవివర్మ) ఎందుకు రహస్యంగా ఈ కేసును ఎందుకు విచారించాడు? కార్తికేయకు తన్వి ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కలశ’మూవీ చూడాల్సిందే.

Ads

ఎలా ఉందంటే..
సైకలాజికల్‌ థ్రిల్లర్, హారర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై దాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. అసలు కథను దాచిపెడుతూ.. ఫస్టాఫ్‌ అంతా సోసోగా నడిపించాడు. ప్రథమార్థంలో ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యత ఇచ్చారు. రచ్చ రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్‌ నవ్వులు పూయిస్తుంది. కానిస్టేబుల్‌ నారాయణ, అతని కూతురు మానసల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇంట్లో దెయ్యం చేసే పనులు కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తే.. మరికొన్ని చోట్ల భయానికి గురి చేస్తాయి.

ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ పరుగులు తీసుస్తుంది. కలశ నేపథ్యం, అక్కాచెల్లెళ్ల చావులకు గల కారణాలు ఊహించని విధంగా ఉంటాయి. కార్తికేయ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసే ట్విస్టులు థ్రిల్లింగ్‌ ఉంటాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్‌ జానర్స్‌ని ఇష్టపడేవారికి కలశ నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీకి చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. యంగ్‌ డైరెక్టర్‌ తన్విగా ఆమె చక్కగా నటించింది. తెరపై కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక టైటిల్‌ రోల్‌ ప్లే చేసిన సోనాక్షి వర్మ.. తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సెకండాఫ్‌తో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. అన్షుగా రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా సమీర్‌, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. విజయ్‌ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల భయపెట్టిస్తుంది. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది. . ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు.

రేటింగ్ :

3/5

Previous articleసైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఈ సినిమా చూసారా.? రెండో రోజునుండి స్క్రీన్స్ పెంచారు.!
Next articleIPL 2024 : రోహిత్ శర్మని పక్కన పెట్టి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని ఎందుకు తీసుకున్నారు..? కారణం ఇదేనా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.