ఆ సినిమాలో బాలయ్యతో నటించే ఛాన్స్ భూమిక మిస్ చేసుకుందని తెలుసా.?

Ads

టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన మూవీ..వేరొక హీరో చేయడం…మాంచి హిట్ కొట్టడం ఎంతో కామన్. అలాగే కొందరు హీరో హీరోయిన్ల కాంబినేషన్లో అసలు మూవీ లు రాకుండా మిస్ అవుతాయి. తమ అభిమాన హీరో హీరోయిన్లను కలిసి స్క్రీన్ పై చూడాలి అనుకునే ఎందరో అభిమానుల ఆశ ఇప్పటికీ తీరలేదు. కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లు అలా సేటై ఇలా ఆగిపోతాయి. అలా మిస్సయిన ఒక క్రేజీ కాంబో నే బాలకృష్ణ- భూమిక.

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ సింహాద్రి. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా భూమికా నటించింది. అయితే ఈ మూవీ మొదట బాలకృష్ణ చేయాల్సిందట. 2003లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సింహాద్రి మూవీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Ads

అయితే ముందుగా స్టోరీ రెడీ చేసిన రచయిత్ర విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి హీరోగా బాలకృష్ణ అనుకోవడం జరిగింది . అయితే అప్పటికే పలు ఫ్యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న బాల కృష్ణ .. అదే టైంకి పలనాటి బ్రహ్మనాయుడు మూవీ చేస్తూ ఉండడంతో మరొక ఫ్యాక్షన్ మూవీ వెంటనే చేయడం బాగోదు అని ఆలోచనతో సింహాద్రి సినిమా వద్దు అని అనుకున్నారట.

అయితే అప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక ఫిక్స్ అయింది. బాలయ్య భూమిక కాంబినేషన్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కు రావడంతో భూమికతో పాటు అంకిత కూడా ఈ సినిమాలో హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన నటించారు. అప్పుడు మిస్ అయిన భూమిక చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణ రూరల్ సినిమాలో నటించింది .కానీ అందులో హీరోయిన్ గా కాదు ఒక కీలకమైన పాత్రలో నటించింది. మొత్తానికి అలా బాలయ్య సింహాద్రి లాంటి మంచి బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నాడు.

Previous articleపెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ కంటే ప్రేమ వివాహం చేసుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారా.? కారణం ఇదేనా.?
Next articleభారీ నష్టాలను మిగిల్చిన మిడ్ రేంజ్ హీరోల 10 ఆక్షన్ సినిమాలు ఇవే…లిస్ట్ లో “విజయ్ దేవరకొండ” సినిమా కూడా.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.