10 లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తే…1.8 లక్షలు మాత్రమే వచ్చింది..! శోభాశెట్టి కోసం నయనిని వారానికే పంపించేశారా..?

Ads

బిగ్‌బాస్‌ సీజన్  7 లో తోటి కంటెస్టెంట్లను, ఆడియెన్స్ ను కూడా కంటతడి పెట్టుకునేలా చేసిన కంటెస్టెంట్‌ ఎవరంటే నయని పావని అని చెప్పవచ్చు. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా బిగ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన నయని. వారం రోజుల్లోనే బలమైన కంటెస్టెంట్‌ గా నిరూపించుకుంది.

అయితే హౌజ్ లోకి వచ్చిన వారం రోజులకే నయని ఊహించని విధంగా ఎలిమినేట్‌ అయింది. దీంతో నయని స్టేజ్ పై ఏడ్చింది. బిగ్ బాస్ హౌస్‌ను ఏడిపించింది. నయని పావని ఎలిమినేషన్ సోషల్ మీడియాలో చర్చలకు దారి తీసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నయని పావని బిగ్ బాస్ సీజన్ 7 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇచ్చింది. హౌజ్ లో ఉన్నది ఆరు రోజులే అయినప్పటికీ, అందరితో ను కనెక్ట్ అయ్యింది. మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతూ, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ గా ప్రూవ్ చేసుకుంది. టాప్ 5 లోకి వెళ్లాలనే టార్గెట్‌ పెట్టుకుంది. కానీ వచ్చిన వారానికి ఎలిమినేట్ అయ్యింది. ఆమె హౌజ్ నుండి బయటకు రావడంతో మిగతా వారంతా ఎమోషనల్ అయ్యారు. హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అనగానే నయని బోరుమని ఏడ్చేసింది.
నయని పావని ఆస్ట్రేలియాలో ఉంటుంది. బిగ్ బాస్ షో కోసం ఆమె ఆస్ట్రేలియా నుండి 10 లక్షలు ఖర్చుపెట్టుకొని వచ్చింది. బిగ్ బాస్ లో ఆమె రెమ్యునరేషన్ రోజుకి 30000 అని తెలుస్తోంది. అంటే ఆమె హౌజ్ లో ఉంది కేవలం 6 రోజులు కాబట్టి ఆమెకు 1,80,000 మాత్రమే వచ్చిందని అంటున్నారు. ఇక  టాక్స్ లాంటివి కట్ చేస్తే లక్ష ఆమె చేతికి రావచ్చు అని కొందరు అంటున్నారు.
కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్‌ తో సీజన్ మొదలు కాకముందే ఎంపిక చేసిన వెంటనే అగ్రిమెంట్ చేసుకుంటారని, అందువల్ల వాళ్ళని 5వ వారం హౌస్‌లోకి పంపినా, వారి పారితోషికం మాత్రం మొదటివారం నుంచి ఇస్తారట. నయనికి కూడా మొత్తం 6 వారాల రెమ్యూనరేషన్ ఇస్తారట. అలా చూస్తే, రోజుకి ముప్పై వేలు,వారానికి రూ.1,80,000 చొప్పున, 6 వారాలకు కలిపి దాదాపు పది లక్షల పారితోషికం అందుతుందని అంటున్నారు.

Ads

ఇక నయని ఎలిమినేట్ అవడంతో నెటిజెన్లు బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ అమ్మాయిని సేఫ్ జోన్ లో కి పంపించి తెలుగు అమ్మాయి నయనిని ఎలిమినేట్ చేసావా బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం శోభాశెట్టిని సేవ్ చేయడానికే నయనిని ఎలిమినేట్ చేశారని, బిగ్ బాస్ ని ఫాలో అయ్యేవారికి ఈజీగా తెలిసిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: బిగ్‌బాస్ తెలుగు-7 కంటెస్టెంట్ “అశ్విని శ్రీ” నటించిన “మహేష్ బాబు” సినిమా ఏదో తెలుసా..?

 

Previous articleఆ డైరెక్టర్ ను కలవడానికి వెళ్తే…హీరో కార్తికేయను గెంటేసారంట.? కానీ ఇప్పుడు?
Next articleఈ 10 మంది డైరెక్టర్లకి మొదటి అవకాశం “రవితేజ” ఇచ్చారని మీకు తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.