బిగ్ బాస్‌లో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?

Ads

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదవ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో  సోమవారం ఒక్కరోజే నామినేషన్స్ ప్రక్రియ ఉండేది. కానీ ఈ సీజన్‌లో నామినేషన్స్‌ని 2 రోజులు పాటు పెట్టారు.

Ads

ఇక మంగళవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యి, ఎనిమిది మంది నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో గతవారం లాగే ఈ వారం కూడా ఒక మేల్ కంటెస్టెంట్ హౌస్ నుండి బయటికి వెళ్తారని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ లో ప్రస్తుతం 9 వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లో ఒక కంటెస్టెంట్ పైన ఒకరు గట్టిగా, అరిచి గోల గోల చేశారు. చాలా మంది కంటెస్టెంట్స్ సిల్లీ కారణాలు చెప్పి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు. దీనిలో భాగంగా ప్రియాంక భోలేల మధ్య, శోభ రతికాల మధ్య, అమర్ దీప్, భోలేల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఒకరి పై ఒకరు కామెంట్స్, కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేశారు.
ఈ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్ దీప్, శోభాశెట్టి, రతిక, ప్రియాంక,  తేజా, భోలే, అర్జున్, యావర్ నామినేషన్స్ లో నిలిచారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎక్కువగా అమ్మాయిలే హౌజ్ నుండి బయటకు వెళ్లారు. గతవారం మాత్రం ఊహించని రీతిలో సందీప్ మాస్టర్ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అతనిలాగే ఈవారం సైతం మేల్ కంటెస్టెంట్ తేజ బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఓటింగ్ పరంగా కూడా తేజకు తక్కువ ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం నైట్ వరకు ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పటిలోగా ఓట్లు పెరిగితే తేజ సేవ్ అయ్యే అవకాశం ఉందని టాక్. తేజ హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆడియెన్స్ అలరిస్తూ వస్తున్నాడు. తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ, ఆకట్టుకుంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా అతని గేమ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు. శోభా చుట్టూ తిరగడం, టాస్క్ లలో అంతగా పర్ఫామ్ చేయలేకపోవడంతో ఈ వారం అతనే బయటికి వెళ్తాడని అంటున్నారు.

Also Read: అప్పుడు రతిక… ఇప్పుడు ఈ కొత్త కంటెస్టెంట్..! రైతుబిడ్డ మళ్ళీ మొదలెట్టాడుగా..?

 

Previous articleవరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుకలలో కనిపించని పవన్..! కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్..!
Next articleముంబై వీధుల్లో ముసుగు వీరుడు.. ఈ టీమిండియా క్రికెటర్ ని గుర్తుపట్టారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.