Ads
ఒక్కోసారి మన పక్కనే ప్రమాదం పొంచి ఉన్నా మనం గమనించలేం. మన అదృష్టం మాత్రమే ఒక్కోసారి మనలని కాపాడుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కేరళలోని ఓ ఉపాధ్యాయుడికి ఎదురైంది. తలపైనే విష సర్పాన్ని పెట్టుకుని దాదాపు 11 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు.
అతను గమ్యానికి చేరుకున్న తరువాత కానీ ఆ విషయం తెలియరాలేదు. అదేంటో వివరంగా తెలుసుకుందాం. కేరళకు చెందిన రంజిత్, సంస్కృత భాషా ఉపాధ్యాయుడు. కందనాడ్‌లోని మేరీ హైస్కూల్లో అతను క్లాస్ పూర్తి చేసుకుని మరొక స్కూల్ కు బయలుదేరాడు. తన ద్విచక్ర వాహనంపైనే స్కూల్ కి వెళ్ళాడు. దారంతా అతనికి ఏమి అనుమానం రాలేదు.
Ads
స్కూల్ కి వెళ్ళిపోయి.. బండి దిగి హెల్మెట్ తీసేసాడు. అంతే దానిపైన విషసర్పం కనిపించింది. హెల్మెట్ లోపల ఉన్న ఈ పాము చనిపోయి కనిపించింది. అతను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే ఈ పాము చనిపోయిందా..? లేక ఎవరైనా ఆ చనిపోయిన పాముని తీసుకొచ్చి హెల్మెట్ లో పెట్టారా? అన్న విషయం తెలియలేదు.
అయితే ఈ విషయం అతని సన్నిహితులకు చెప్పడంతో.. వారు రంజిత్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ పాము కరిచిందో.. లేదో అని రక్తపరీక్ష చేయించారు. ఆ పాము కాటేయలేదని డాక్టర్లు చెప్పడంతో.. అప్పటికిగాని అతను కుదుటపడలేదు.