Ads
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ ఫలితాలు వచ్చాయి. కాంగెస్ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఫలితాలు కొందరికి షాక్ ఇవ్వగా, కొందరు అనూహ్యంగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
Ads
ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ పాతబస్తీ కంచుకోట అని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో ఏ పార్టీ పోటీచేసినా అపజయం తప్పదు. అయితే తాజాగా గోషామహాల్ నుండి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడవసారి విజయం సాధించారు. అయితే ఈ ఘనతను గతంలో ఓ హిందునేత సాధించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ పాతబస్తీ అంటే మజ్లిస్ పార్టీకి కంచుకోట. అక్కడ నివసించేవారిలో అధిక శాతం మంది ముస్లింలే కావడంతో అక్కడ ఎంఐఎం కాకుండా ఎవరు పోటీ చేసిన గత కొన్ని దశాబ్దాలుగా ఓటమిపలు అవుతూనే ఉంది. మేనిఫెస్టో కూడా ప్రకటించకుండానే, మజ్లిస్ పార్టీ క్యాండిడేట్లు అసెంబ్లీ ఎలెక్షన్స్ లో పోటీ చేస్తున్నారు. అయినా పాతబస్తీ ప్రజలు ఆ పార్టీవారినే గెలిపిస్తూ వస్తున్నారు.
అలాంటి ప్రాంతంలో ఒక హిందూ నాయకుడు బిజెపి పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, రికార్డ్ సృష్టించారు. ఆ నాయకుడి పేరు బద్దం బాల్ రెడ్డి. 1985 – 1994 వరకు వరుసగా మూడు సార్లు కార్వాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, హ్యాట్రిక్ విజయన్ని అందుకున్నారు ఆయన తరువాత ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న గోషామహాల్ నుంచి బీజేపీ పార్టీ తరుపున పోటీచేసి గెలిచిన హిందునేతగా రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు.
అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 21,457 ఓట్ల ఆధిక్యతతో బీఆర్ఎస్ క్యాండిడేట్ నంద కుమార్ వ్యాస్ పై విజయం సాధించారు. రాజాసింగ్ 2014, 2018 ఎలెక్షన్స్ తో పాటు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. బీజేపీ లీడర్ బద్దం బాల్ రెడ్డి అనంతరం వరుసగా మూడుసార్లు గెలిచిన హిందునేతగా రాజాసింగ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
Also Read: పాతబస్తీలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒకేఒక్క హిందూ నేత ఎవరో తెలుసా.?