33 కోట్ల బడ్జెట్…కానీ 50 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి..! 2023లోనే అత్యంత డిజాస్టర్ సినిమా ఇదే.!

Ads

సినీ ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేది సర్వ సాధారణం. ఒక సంవత్సరంలో వంద చిత్రాలు విడుదల అయితే, అందులో అధిక శాతం చిత్రాలు ఫ్లాప్ గా, లేదా యావరేజ్‌గా నిలిస్తే, చాలా తక్కువ సినిమాలు మాత్రమే విజయాన్ని సాధిస్తాయి.

Ads

గత ఏడాది కూడా అనేక చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఒక మూవీ మాత్రం సినీ ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఆ చిత్రాన్ని కోట్ల రూపాయలతో తెరకెక్కించగా, రిలీజ్ తరువాత ఆ మూవీ వేలల్లో కూడా కలెక్ట్ చేయలేకపోయింది. బాలీవుడ్ లో దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2023 బాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. గడిచిన సంవత్సర కాలాన్ని ఒక్కసారి చూస్తే, హిట్ చిత్రాల కన్నా ఫ్లాప్ చిత్రాలే ఎక్కువ ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలు కొన్ని మాత్రమే విజయం సాధించి, బాలీవుడ్ కు ఊరటనిచ్చాయి. ఇక గత ఏడాది డిజాస్టర్ మూవీగా పంచ్ కృతి ఫైవ్ ఎలిమెంట్స్ నిలిచింది. ఈ చిత్రం ఐదు స్టోరీస్ తో తెరకెక్కింది. ఈ చిత్రానికి సంజయ్ భార్గవ్ దర్శకత్వం వహించారు.
పంచ్ కృతి మూవీ రూ. 33 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా, సంజయ్ భార్గవ్, హరిప్రియా భార్గవ్  నిర్మించారు. ఈ మూవీలో బ్రిజేంద్ర కాలా, తన్మయ్ చతర్వేది, ఉమేష్ బాజ్‌పాయ్, కురంగి విజయశ్రీ నాగరాజు తదతరులు నటించారు. ఈ మూవీ ఆగస్టు 25న ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ అయింది. కానీ ఈ మూవీకి అంతగా టాక్ రాలేదు. అయితే అప్పటికే గదర్ 2 మరియు ఓ మై గాడ్ 2 సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. ఈ మూవీ తరువాత జవాన్ రిలీజ్ కావడంతో ఈ మూవీ పెద్ద చిత్రాల మధ్య నలిగిపోయింది.
పంచ్ కృతి దాదాపు రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాలీవుడ్ హంగామా సమాచారం ప్రకారం, పంచ కృతి మూవీ మొదటి వారంలో కేవలం 50 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం 10,000 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఆ తర్వాత ఈ మూవీ థియేటర్ల నుండి తొలగించబడింది. ఈ చిత్రం 2023లో నిలిచిన సినిమాలలో అతిపెద్ద డిజాస్టర్‌‌గా నిలిచింది.

Also Read: VENKY RE-RELEASE: రీ రిలీజ్ లో రికార్డు సృష్టించిన రవితేజ వెంకీ….కలెక్షన్స్ ఎంత అంటే…?

Previous article“దేవర” మూవీలో “శ్రీకాంత్” ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?
Next articleనిద్రపోయే ముందు…దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.