Ads
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, పవర్ స్టార్ గా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్. గత కొంత కాలం నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన వంతు సేవ చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు రాసిన చరిత్రలోని ఒక వాక్యం వార్తల్లో నిలిచింది.
అందులో బ్రహ్మం గారు, “తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయా” అని రాశారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాలు చాలా వరకు చెప్పినట్టే జరిగాయి. భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కోబోయే సమస్యల గురించి, వాళ్ల పరిస్థితుల గురించి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అదే విషయాలు ఆయన చెప్పినట్టు జరిగాయి. ఇప్పుడు ఈ విషయం కూడా అలాగే బ్రహ్మం గారు రాసినట్టే జరిగింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా వెళ్లారు.
Ads
చిరంజీవి, ఆయన భార్య సురేఖ గారు, కూతురు శ్రీజ, సుస్మిత, వారి పిల్లలు, హీరో రామ్ చరణ్, నిహారిక కొణిదెల, సాయి దుర్గా తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ పిల్లలు అయిన ఆద్య, అకిరా కూడా వెళ్లారు. ఆద్య, అకిరా వీడియో కాల్ చేసిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలిపారు. ఇతర మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు.
వీరితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, నరేంద్ర మోడీ తదితరులు ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంతా కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్లి ఎయిర్ పోర్ట్ దగ్గర నుండి రిసీవ్ చేసుకుని ప్రమాణ స్వీకారం జరిగే స్థలానికి తీసుకెళ్లారు.
The moment we've all been waiting for 😭
#PawanKalyanAneNenu pic.twitter.com/wPGDeJ5FaB— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 12, 2024